- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలి : కలెక్టర్
దిశ, ఖైరతాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 పరీక్షల ద్వారా నూతనంగా ఉద్యోగం పొందిన ఉద్యోగులు నిబద్ధతతో, బాధ్యతాయుతంగా విధులను నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రూప్ 4 పరీక్షల ద్వారా జూనియర్ అసిస్టెంట్ లుగా నియామకమైన ఉద్యోగులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వ సేవ హోదా కు చిహ్నమని అన్నారు. నూతనంగా నియామకమైన ఉద్యోగులు అంకితభావం, నిబద్ధత,జవాబుదారితనం తో పనిచేయాలని అన్నారు. ప్రతి సమస్యను ఛాలెంజ్ గా తీసుకొని పరిష్కారం చేయాలన్నారు. వినయం, ఓపిక తో విని ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలి అన్నారు. ఆధునిక టెక్నాలజీ, నైపుణ్యలను పెంపొందించు కోవాలని సూచించారు. బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి తేవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఈ. వెంకట చారి, కలెక్టరేట్ ఏఓ సదానందం తదితరులు పాల్గొన్నారు.