- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘బేడా బుడగ జంగాల’ను ఎస్సీ జాబితాలో చేర్చాలి.. తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేత
దిశ, కారంపూడి: కారంపూడి మండల పరిధిలో నివసిస్తున్న బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడ బుడగ జంగాల ఎస్సి- 9 షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం తహసిల్దార్ పుల్లారావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేట సెన్నెగెండ్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పోతు రాజు గుట్ట కాలనీ నందు నివసిస్తున్న బేడా బుడగ జంగాలను బీసీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. మాకు అన్యాయం జరుగుతుంది. దీనితో మా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. బీసీ క్యాస్ట్ ఇవ్వడంతో మా పిల్లలు చదువుకు, ఉద్యోగాలకు దూరమవుతున్నారు. ఇప్పటి కైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు రాజ్యాంగం కల్పించిన 59 ఉపకులంలో షెడ్యూల్ 9 ప్రకారం మాకు మాకు రావలసిన ఎస్సి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కప్పెర శ్రీను, కప్పేర రామస్వామి,అంజయ్య, వెంకటేష్,తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.