AP Voters List : ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల

by M.Rajitha |
AP Voters List : ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)కి చెందిన ఓటర్ల తుది జాబితా(Voters Final List)ను ప్రకటించింది ఎన్నికల సంఘం(EC). 2025 జనవరి 1 నాటికి ఏపీలో మొత్తం 4,14,40,447 మంది ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించింది. వారిలో పురుషులు 2,02,88,543 ఉండగా.. 2,10,81,814 మంది మహిళలు, థర్డ్ జెండర్స్ 3400 మంది ఉన్నారు. యువ ఓటర్లు 5,14,646 మంది ఉండగా.. సర్వీస్ ఓటర్లు 66,690 మంది ఉన్నట్టు ఈసీ తెలిపింది. కాగా ఏపీలో మరో 232 పోలింగ్ కేంద్రాలను పెంచుతున్నట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story