‘వారిని పరామర్శించకపోవడం దారుణం’.. పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘వారిని పరామర్శించకపోవడం దారుణం’.. పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: గేమ్ చేంజర్(Game Changer) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లొస్తూ ఇద్దరు అభిమానులు మ‌ర‌ణించిన సంగతి తెలిసిందే. శనివారం రోజు రాజమహేంద్రవరంలో జ‌రిగిన‌ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుకకు హాజ‌రై తిరిగి ఇంటికి వెళుతున్న స‌మ‌యంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ(23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు అభిమానులు రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయారు.

ఈ ఘటన పై మాజీ మంత్రి రోజా స్పందిస్తూ.. గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు అభిమానులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఇంకా పరామర్శించకపోవడం అమానవీయం అని వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా(Former Minister Roja) విమర్శించారు. ‘‘రేవతి వ్యవహారంలో పుష్ప-2(Pushpa 2) టీమ్ బాధ్యతగా వ్యవహరించలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్నదేమిటి? పైగా వారి మరణానికి వైసీపీ రోడ్లు వేయకపోవడమే కారణమని పవన్ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు’’ అని ఆమె ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story