వేట కుక్క‌ల దాడిలో 20 గొర్రెలు మృతి..

by Aamani |
వేట కుక్క‌ల దాడిలో 20 గొర్రెలు మృతి..
X

దిశ‌,ఏటూరునాగారం : వేట కుక్క‌ల దాడిలో 20 గొర్రెలు మృతి చెందిన ఘ‌ట‌న నూగూరు వెంక‌టాపురం మండ‌లం గోల్ల‌గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. వెంక‌టాపురం మండ‌లం గొల్ల‌గూడెం గ్రామానికి చెందిన న‌న్నే బోయిన తిరుప‌తి(45) త‌న‌కున్న గొర్రెల మంద‌ను త‌న ఇంటి వ‌ద్ద అదివారం రోజున గొర్రెల చావ‌డిలో గొర్రెల మంద‌ను ఉంచి ఇంట్లో ప‌డుకున్నాడు. అర్ద రాత్రి స‌మ‌యంలో గోర్రెల అరుస్తున్న శ‌బ్దాలు విన‌బ‌డ‌డంతో లేచి చూసే స‌రికి వేట కుక్క‌లు గొర్రెల చావ‌డిలో దూరి గొర్రెల మంద‌పై దాడి చేసి పారిపోయాయి. ఈ దాడిలో 20 గొర్రెలు మృతి చెంద‌గా 8 గొర్రెలకు, 2 మేక‌ల‌కు గాయాల‌య్యాయి. కాగా ఈ ఘ‌ట‌న‌తో బాదితుడుకి సుమారు 2 ల‌క్ష‌ల వ‌ర‌కు న‌ష్టం వాటిల్లింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

Advertisement

Next Story