- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
H1B Visa : హెచ్1బీ వీసా హోల్డర్లకు అమెరికా భారీ గుడ్ న్యూస్
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాలో హెచ్1బీ వీసా కలిగిన భారతీయులకు యూఎస్ ఎంబసీ గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌కు రాకుండానే హెచ్1బీ వీసా రెన్యూవల్ చేసుకునేలా కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఈ మేరకు వివరాలను వెల్లడించింది. హెచ్1బీ వీసా రెన్యూవల్ ప్రక్రియ ఈ ఏడాది నుంచి ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో వివిధ వృత్తుల్లో ఉండి స్వదేశానికి వచ్చి వీసా రెన్యూవల్ స్టాంపింగ్ చేయించుకోవాలనుకునే వారికి ఊరట లభించినట్లయింది. హెచ్1బీ వీసా రెన్యూవల్ అంశంలో ఇప్పటికే అమెరికా పైలెట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడంతో ఈ అంశంలో ముందడుగు పడినట్లయింది. హెచ్1బీ వీసా రెన్యూవల్ చేసుకోవడానికి భారత్‌కు వచ్చి వెళ్లడం అమెరికాలో ఉన్న భారతీయులకు దీర్ఘకాలిక సమస్యగా మారింది. అపాయింట్‌మెంట్ స్లాట్లు పొందితేనే వీసా రెన్యూవల్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో స్లాట్లు దొరకడం కష్టంగా మారుతోంది. తాజా ప్రతిపాదనతో అమెరికాలో హెచ్1బీ వీసా కలిగి ఉన్న భారతీయులకు భారీ ఉపశమనం లభించనుంది. హెచ్1బీ వీసాలతో టెక్నాలజీ, ఇంజినీరింగ్ రంగాల్లో అమెరికన్లకు ఉద్యోగాలు లభించడం లేదని కొంత మంది విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి లాంటి వారు వారి వాదనను సమర్ధిస్తున్నారు.
మెజార్టీ హెచ్1బీ వీసాలు మనకే..
హెచ్1బీ వీసాలు అత్యధికంగా అందుకుంటున్న దేశంగా భారత్ నిలుస్తోంది. 2022కి గాను అమెరికా జారీ చేసిన హెచ్1బీ వీసాల్లో 77శాతంతో మొత్తం 3లక్షల20వేల మంది భారతీయులు ఈ రకం వీసాలు పొందారు. 2023లో 72.3శాతంతో ఈ సంఖ్య 3లక్షల86వేలకు చేరింది. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న వారిలో సైతం భారతీయులే అధికంగా ఉన్నారు. అన్ని దేశాలను వెనక్కి నెట్టి 2024లో 3లక్షల 31 వేల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో విద్యనభ్యసిస్తూ టాప్‌లో నిలిచారు. 2008-09 అకడమిక్ ఇయర్ తర్వాత అమెరికాలో భారత్‌కు చెందిన విద్యార్థులు ఈ స్థాయిలో విద్యనభ్యసించడం ఇదే తొలిసారి కావడం విశేషం.