Hydra: మూడు వారాల్లో చర్యలు తీసుకుంటాం.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీ

by Gantepaka Srikanth |
Hydra: మూడు వారాల్లో చర్యలు తీసుకుంటాం.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణలపై నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని హైడ్రా(Hydra) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా.. సోమవారం హైడ్రా కార్యాలయం(Hydra office)లో చీఫ్ ఫిర్యాదులు తీసుకున్నారు. తొలిరోజే ప్రజలు ఫిర్యాదులతో హైడ్రా కార్యాలయానికి పోటెత్తారు. మొదటి రోజు 83 ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) స్వీకరించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైడ్రా ప్రజావాణి కొనసాగింది.

ఫిర్యాదులను పరిశీలించి మూడు వారాల్లో చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ బాధితులకు భరోసా ఇచ్చారు. చెరువులు, పార్కులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేశారని ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. మరోవైపు సంక్రాంతి పండుగ నుంచి హైడ్రా పోలీస్‌స్టేషన్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హైడ్రా పీఎస్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఇకపై హైడ్రాకు సంబంధించిన కార్యకలాపాలు పూర్తిగా కూడా హైడ్రా పోలీస్‌స్టేషన్ ద్వారా నిర్వహించేందుకు వీలుగా హైడ్రా కమిషన్ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Next Story