మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

by Kalyani |
మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు
X

దిశ, తూప్రాన్ : డబ్బుల కోసం సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. సీఐ రంగా కృష్ణ ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… బీహార్ రాష్ట్రానికి చెందిన సూరజ్ కుమార్ చంద్ర వంశీ అనే వ్యక్తి నీతూ దేవిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 2022లో బీహార్ ముజఫర్ పూర్ రిక్షా నడుపుతుండగా రజినీ దేవి అనే మహిళ తో పరిచయం ఏర్పడి శారీరక సంబంధం పెంచుకుని సహజీవనం చేశాడు. అక్కడి నుంచి హైదరాబాద్ లో కొన్ని రోజులు ఉండి 2023 అక్టోబర్ లో మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కళ్ళకాల్ శివారులో గీత ప్యానెల్ ప్రొడక్ట్ కంపెనీ కి వచ్చి భార్యాభర్తలుగా చెప్పి అక్కడే ఉండి కంపెనీలో పని చేశారు.

ఈ సమయం లో ఇద్దరికీ డబ్బుల విషయంలో గొడవ జరగడంతో 18 అక్టోబర్ రోజు మద్యం సేవిస్తూ డబ్బులు ఇవ్వాలని అడగగా ఆమె నిరాకరించింది. ఇంకోరితో అయిన ఉంటా కానీ నీకు డబ్బులు ఇవ్వను అనడంతో ఆవేశానికి గురయిన సూరజ్ కుమార్ ఆమె గొంతుకు చున్ని కట్టి చంపేసి ఆమె దగ్గర ఉన్న రూ.7,000 తీసుకుని అందులో నుండి రూ.1500 లతో ఫోన్ కొనుగోలు చేసి మిగతా రూ. 5500 వేల రూపాయలతో ఢిల్లీలో తన వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేశారు. డబ్బులు అయిపోగానే మళ్ళీ తిరిగి పనికోసం వస్తుండగా తూప్రాన్ సీఐ రంగా కృష్ణ, ఎస్ఐ సుభాష్ గౌడ్ తమ సిబ్బందితో కలిసి చాకచక్యంగా పట్టుకుని అతని వద్ద నుంచి సెల్ ఫోన్ రికవరీ చేసి రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed