ఆకతాయిలు అమ్మాయిల జోలికి వెళ్ళారో కటకటాలే

by Naveena |
ఆకతాయిలు అమ్మాయిల జోలికి వెళ్ళారో కటకటాలే
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఆకతాయిలు,పోకిరీలు అమ్మాయిలను వేధించడం,ఈవ్ టీజింగ్ చేయడం,వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ..చేశారో కటకటాల పాలవుతారని డిఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు శనివారం స్థానిక భరోసా సెంటర్ లో నలుగురు ఆకతాయిలకు,వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలతో ఫోక్స్ కేసులు బనాయించి జైలుకు పంపుతామని ఆయన హెచ్చరించారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని,మళ్ళీ ఇలాంటి సంఘటనలకు తాము పూనుకోమని వారితో హామీ పత్రాన్ని రాయించుకున్నారు. మహిళల పట్ల గౌరవ భావంతో మెలగడం అందరి విధి అని ఆయన అన్నారు. లైంగిక వేధింపులు,ఈవ్ టీజింగ్,ర్యాగింగ్,అసభ్య ప్రవర్థన ఎవరు చేసినా 'భరోసా' కేంద్రాన్ని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ పీఎస్ సీఐ శ్రీనివాసులు,ఎన్జీవోస్ ఎస్.జగపతిరావు,ఎ.రాజసింహుడు,తదితర షీ టీం సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed