ప్రతిపక్షం పై రేవంత్ సర్కార్ రీవైజ్ మూడ్ లో ఉంది

by Sridhar Babu |
ప్రతిపక్షం పై రేవంత్ సర్కార్ రీవైజ్ మూడ్ లో ఉంది
X

దిశ, ఆసిఫాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పై పట్టింపు లేదని, ప్రస్తుతం ప్రతిపక్షాల పై రేవంత్ సర్కార్ రీవైజ్ మూడ్ లో ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జైన్నూర్ లో లైంగికదాడికి గురైన గిరిజన మహిళకు సరైన వైద్యం అందించలేదు. రెండు వర్గాల మధ్య ఘర్షణలో భారీ ఆస్తినష్టం జరిగితే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎలాంటి వర్గ ఘర్షణలు జరగలేదన్నారు.

గురుకుల ఆశ్రమ సంక్షేమ వసతి గృహాల్లో సైతం ఫుడ్ పాయిజన్ జరిగిన దాఖలాలు లేవన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన పాముకాటులు, ఫుడ్ పాయిజన్ లతో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని, వాంకిడి ఫుడ్ పాయిజన్ తో మృతి చెందిన శైలజ కుటుంబానికి ప్రకటించి ఆర్థిక సహాయం, తండ్రికి నేటికీ కాంట్రాక్టు ఉద్యోగం ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రలో ఉన్న వ్యవస్థలను సైతం పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని వాపోయారు. కేసీఆర్ పై ఉన్న కోపాన్ని ప్రజా సమస్యలను నిలదీస్తున్న ప్రతిపక్షమైన తమ నాయకులపై చూపిస్తుందని ఆరోపించారు. అందుకే కేటీఆర్ పై కేసు నమోదు చేశారని, ఎన్ని కేసులు పెట్టినా తాము భయపడబోమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story