రేపే విచారణ.. ఈడీ నోటీసులకు KTR షాకింగ్ రిప్లై

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-06 15:04:15.0  )
రేపే విచారణ.. ఈడీ నోటీసులకు KTR షాకింగ్ రిప్లై
X

దిశ, వెబ్‌డెస్క్: ఈడీ నోటీసు(ED Notices)లపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. ఏసీబీ(ACB) తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వు ఉందని, హైకోర్టు(TG High Court) పైన ఉన్న గౌరవంతో.. హైకోర్టు తీర్పును వెలువరించేంతవరకు ఈ అంశంలో తనకు సమయం ఇవ్వాలని ఈడీని కేటీఆర్ కోరారు. రేపు ఈడీ విచారణకు హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. కాగా, వారంరోజుల క్రితం ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది.

జనవరి 7న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌కు, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 2, 3న విచారణకు రావాలని అరవింద్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే అనూహ్యంగా అధికారులు ఇద్దరు విచారణకు హాజరు కాలేదు. వారి బాటలోనే కేటీఆర్‌ సైతం రేపు హాజరు కావడం లేదని రిప్లై ఇచ్చారు.


Also Read.

Breaking News : కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై రేపు హైకోర్టు తీర్పు

Advertisement

Next Story