- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శేషాచలం అటవీ ప్రాంతంలో 12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. స్మగ్లర్ అరెస్ట్
దిశ ప్రతినిధి, తిరుపతి: తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో 12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, ఒకరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణ మేరకు, టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీలు బాలిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, షరీఫ్ ల మార్గనిర్దేశంలో ఆర్ ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ ఎస్ ఐ విష్ణు వర్ధన్ కుమార్ టీమ్ శుక్రవారం రాత్రి నుంచి తిరుమల శేషాచలం అడవుల్లో కూంబింగ్ చేపట్టారు.
శనివారం ఉదయం ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి కనిపించాడు. అతను పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకున్నారు. అతనిని విచారించగా ఒక డంప్ లో దాచి ఉంచిన 12 ఎర్రచందనం దుంగలు చూపించాడు. అతనిని తమిళనాడు కు చెందిన వ్యక్తి గా గుర్తించి అరెస్టు చేశారు. అతనిని దుంగలతో సహా తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అడవిలోని మరికొంత మంది స్మగ్లర్లు ఉన్నట్లు విచారణ లో తెలియడంతో వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.