ఆ జిల్లాలో 10 లక్షల మంది ఓటర్లుగా నమోదు..

by Aamani |
ఆ జిల్లాలో 10 లక్షల మంది ఓటర్లుగా నమోదు..
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ : ప్రత్యేక ఓటరు నమోదు 2025 లో భాగంగా తుది ఓటరు జాబితాను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రతీక్ జైన్ విడుదల చేశారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్ లో తుది ఓటరు ముసాయిదా జాబితా పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి తుది ఓటర్ ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఓటరు నమోదు తుది జాబితాలో మొత్తం 10 లక్షల మంది ఓటర్లుగా నమోదు అయ్యాయన్నారు. జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో1133 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో తుది ఓటర్ ముసాయిదా జాబితాలో10,00,032 మంది ఓటర్లు ఉన్నారని ఇందులో 4,92,613 మంది పురుషులు, 5,07,644 మంది స్త్రీల ఓటర్లతో పాటు 45 మంది ఇతర ఓటర్లుగా నమోదయ్యారని ఆయన తెలిపారు. పరిగి నియోజకవర్గంలో 2,71,060 మంది ఓటర్లకు గాను 1,35,522 మంది పురుషులు, 1,35,528 మంది స్త్రీలు, 10 మంది ఇతర ఓటర్లు ఉన్నారన్నారు.

వికారాబాద్ నియోజకవర్గంలో 2,34,933 మంది ఓటర్లు నమోదు కాగా 1,16,388 మంది పురుషులు, 1,18,524 మంది స్త్రీలు, 21 మంది ఇతర ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. తాండూర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,47,783 ఉండగా 1,19,824 మంది పురుషులు 1,27,952 మంది స్త్రీలు 7 గురు ఇతర ఓటర్లు ఉన్నారని తెలిపారు. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గం లో 2,46,526 మంది ఓటర్లలో 1,20,879 పురుష ఓటర్లు ఓటర్లు కాగా 1,25,640 మంది స్త్రీల ఓటర్లతో పాటుగా 7 మంది ఇతర ఓట్లు కలిగి ఉన్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 549 సర్వీస్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. పరిగిలో 247, వికారాబాద్ 79, తాండూర్ 53, కొడంగల్ లల్లో 170 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నేమత్ అలీ, డిప్యూటీ తహసీల్దార్ డి.ఉష్యా, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story