‘ప్రైవేటు బస్సులు దోచుకుంటున్నాయి’.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2025-01-06 14:38:22.0  )
‘ప్రైవేటు బస్సులు దోచుకుంటున్నాయి’.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారిని ప్రైవేట్ ట్రావెల్స్ దోచుకుంటున్నాయని వైసీపీ ఎంపీ(YCP MP) విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) వ్యాఖ్యానించారు. రెగ్యులర్ ఛార్జీలపై డబుల్, ట్రిపుల్ వసూలు చేస్తున్నాయన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ దోపిడీని అరికట్టాలని ఆయన కోరారు. మామూలు రోజుల్లో రూ.1500 వరకు ఉండే హైదరాబాద్‌–వైజాగ్ ప్రైవేట్ బస్సుల ఏసీ స్లీపర్ టికెట్‌కి ప్రస్తుతం రూ.5k, రూ.1200 వరకు ఉండే HYD-TPT టికెట్ రూ.3k కి పైగా వసూలు చేస్తున్నాయని చెప్పారు.

‘కేవీ రావు ఎవరో నాకు తెలియదు’

కాకినాడ పోర్టు(Kakinada Port) సెజ్‌కు సంబంధించిన కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది. కాకినాడ సీ పోర్ట్ షేర్ల వ్యవహారంపై తనకు సంబంధం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌(Hyderabad)లో ఈడీ(ED) విచారణ అనంతరం ఆయన మాట్లాడారు. 6గంటల పాటు అధికారులు ప్రశ్నించినట్లు తెలిపారు. మొత్తం 25 ప్రశ్నలు అడిగారన్నారు. కేవీ రావుతో నాకు సంబంధం లేదు. 2020 మేలో నేను ఫోన్ చేశానని ఆయన చెబుతున్నారు. కాల్ డేటాతో చెక్ చేసుకోవచ్చు. సీపోర్ట్ విషయంలో నేనెవరికీ ఫోన్ చేయలేదు. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం. కేవీ రావు తిరుపతికి వచ్చి దేవుడు ముందు నిజాలు చెప్పాలి అని పేర్కొన్నారు.

Advertisement

Next Story