పకడ్బందీగా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలి

by Sridhar Babu |
పకడ్బందీగా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలి
X

దిశ,బెల్లంపల్లి : పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బెల్లంపల్లిలో సోమవారం ఆయన పర్యటించారు. కూరగాయల మార్కెట్, డంపింగ్ యార్డ్, అమృత్ 2.0 నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూరగాయల మార్కెట్లో వ్యాపారులకు కనీస సదుపాయాలకి లోటు లేకుండా చూడాలన్నారు. మూత్ర శాలలు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం ఉండాలన్నారు.

ప్రతిరోజూ ఇంటి నుంచి తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలన్నారు. చెత్తలో ఉపయోగపడే వాటిని వేరుచేసి షేగ్రీగేషన్ షెడ్డు కు తరలించాలని కోరారు. వాటిని సేంద్రియ ఎరువుల తయారీకి వినియోగించాలని సూచించారు. కన్నాల మిషన్ భగీరథ పంప్ హౌస్ వద్ద అమృత్ 2.0 శుద్ధ జలం పథకం నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఉన్నారు.

Advertisement

Next Story