- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అతుకులబొంతగా రోడ్డు..రెండు నెలలకోసారి రోడ్డు తవ్వుడే..
దిశ, పరిగి : అదేంటీ జేసీబీతో నడి రోడ్డుపై గుంత తవ్వుతున్నారు అనుకుంటున్నారా.. అవును మీరు చూస్తున్నది నిజమే. మీరు కొత్తగా చూస్తున్నట్టు ఉన్నారు, కానీ మా పరిగి మున్సిపల్ ప్రజలకు నడిరోడ్డుపై తవ్వడం లీకేజీని సరి చేయడం మామూలే, ఇలా రెండు నెలలకోసారి టెలిఫోన్ ఎక్స్చేంజ్ మొదలు రిజిస్ట్రేషన్ కార్యాలయం వరకు రోడ్డు పరిస్థితి ఇలాగే ఉంటుంది. కోట్ల రూపాయలు వెచ్చించి సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా వేశారు బాగానే ఉంది. కానీ మిషన్ భగీరథ పైప్ లైన్ వేసే సమయంలో అధికారులు, పాలకులు పట్టింపు లేని తనంలో వల్ల రోడ్డు మధ్యలో పైప్ లైన్ వచ్చింది.
ఇలా రెండు నెలలకోసారి ఈ రోడ్డును జేసీబీలతో తవ్వించడం మట్టితో పూడ్చి వేయడం చేస్తుంటారని మున్సిపల్ ప్రజలు అనుకుంటున్నారు. రోడ్డు వేసే సమయంలో నాణ్యత పాటించక పోవడం ఒక వంతైతే, అందులో మళ్లీ పైప్ లైన్ లీకేజీ మరొకటి. రోడ్డంతా తవ్వడం లీకేజీ సరి చేయడంతో అతుకుల బొంత గా తయారైంది పరిస్థితి.ఈ రోడ్డును ప్యాచుల రోడ్డని, అతుకుల బొంత రోడ్డని కొందరు అనుకుంటున్నారు. పూర్తిగా పాడవ్వకముందే రోడ్డు మధ్యలో ఉన్న మంచినీటి పైప్ లైన్ ఒక సైడ్ నుంచి వేస్తే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు. రోడ్డు మాటిమాటికి తవ్వడం వల్లే అంతంత మాత్రంగా ఉన్న రోడ్డు పూర్తిగా పాడవుతుందని ప్రయాణికులు, మున్సిపల్ ప్రజలు అనుకుంటున్నారు.