బాయ్ ఫ్రెండ్‌తో కీర్తి సురేష్ పెళ్లి .. కట్నం ఎంత ఇస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Kavitha |   ( Updated:2024-11-25 16:46:17.0  )
బాయ్ ఫ్రెండ్‌తో కీర్తి సురేష్ పెళ్లి .. కట్నం ఎంత ఇస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
X

దిశ, సినిమా: ‘నేను శైలజ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తర్వాత ‘నేను లోకల్’, ‘మహానటి’, ‘అజ్ఞాత వాసి’, ‘దసరా’, ‘మిస్ ఇండియా’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ‘మహానటి’, ‘దసరా’ చిత్రాలకు అయితే అవార్డులు కూడా వచ్చాయి. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే.. హీరోయిన్ కీర్తి సురేష్ వచ్చే నెలలో తన బాయ్ ఫ్రెండ్ ఆంటోని తటిల్‌ని గోవాలో పెళ్లి చేసుకోబోతున్నసంగతి తెలిసిందే. ఇక తాజాగా కీర్తి సురేష్ తండ్రి సురేష్ దీనిపై అఫీషియల్ క్లారిటీ కూడా ఇచ్చారు. దీంతో కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే ఈ భామ కోడలిగా వెళ్తున్న క్రమంలో ఈమెకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక ఈ జంట ఒక్కటి కాబోతున్న వేళ ఆంటోనీ.. కీర్తి సురేష్ నుంచి ఒక్క రూపాయి కూడా కట్నం ఆశించిలేదట. కానీ ఆమె తల్లిదండ్రులే ఆమెకు అప్పజెప్పాల్సిన ఆస్తులు, బంగారం, తన ప్రాపర్టీస్ అన్ని తనకు అప్పజెప్పాలి కనుక.. కూతురుకు హైదరాబాదులో ఉన్న ప్రాపర్టీస్‌తో పాటు చెన్నైలో ఉన్న రెండు విల్లాలను అలాగే ఆమె కోసం కొన్ని దాచిన బంగారాన్ని, వాళ్ల ఆస్తుల్లో సగ భాగాన్ని కూడా ఆమె పేరున రాసి ఇచ్చేశారట. దీంతో ప్రస్తుతం మహానటి కట్నం మ్యాటర్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Read More...

Rashmika Mandanna : ఆ విషయం అందరికీ తెలుసు.. పెళ్లి అతడితోనే అంటూ హింట్ ఇచ్చేసిన రష్మిక


Advertisement

Next Story

Most Viewed