Pawan: మోడీ చొరవతో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Ramesh Goud |
Pawan: మోడీ చొరవతో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ(PM Modi) చొరవతో ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) రాష్ట్ర అభివృద్ధి(Development) పరుగులు పెడుతోందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు. మోడీ ఏపీ పర్యటన(Modi Ap Tour)పై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రధానికి హృదయపూర్వక స్వాగతం(Welcome) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ, ఈరోజు విశాఖ కేంద్రంగా "దక్షిణ కోస్తా రైల్వే జోన్" కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. అలాగే పూడిమడకలో రూ.1,85,000 కోట్ల పెట్టుబడితో NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లి ప్రాంతంలో రూ.1,877 కోట్ల పెట్టుబడితో బల్క్ డ్రగ్ పార్క్ లకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.

అంతేగాక రాయలసీమ ప్రాంత యువతకు ఉపాధి కల్పించేలా, కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో వాణిజ్య అభివృద్ధి కోసం తిరుపతి జిల్లాలో రూ.2,139 కోట్ల పెట్టుబడితో క్రిస్ సిటీ నిర్మాణం, వీటితో పాటుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను దేశంలోని వివిధ నగరాలకు కలిపేలా జాతీయ రహదారులు, రైల్వే లైన్ల వంటి దాదాపు రూ.1,99,786 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే పూర్తయిన రూ.8,762 కోట్ల విలువైన జాతీయ రహదారులు, రైల్వే లైన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రారంభోత్సవం చేయనున్నారని వివరించారు. ఇక మొత్తంగా రూ.2,08,548 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలో చేపట్టి, ఎన్‌డీఏ కూటమిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ మాట నిలబెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని జనసేన అధినేత రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed