- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల జోరు.. 10 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఊపందుకుంది. ఈనెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన కొనుగోలు క్రమంగా పెరిగిన ఇప్పటివరకు 10 లక్షల మెట్రిక్‌టన్నులు ధాన్యం సేకరణ జరిగింది. ఐదారు రోజుల నుంచి రోజుకు లక్ష మెట్రిక్‌టన్నులు కొనుగోలు జరుగుతోంది. అకాల వర్షాలు, ఈదురుగాలతో రైతులు త్వరగా పంట కోతలు కోస్తూ ధాన్యం కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రాల వద్ద ట్రాక్టర్లు, డీసీఎంల క్యూ కనిపిస్తోంది. ఈ సందడి కొనుగోలు కేంద్రాల వద్ద మరో 20 రోజుల వరకు కొనసాగవచ్చని, తరువాత వరికోతలు ముగింపు దశకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం రబీ సీజన్లో 57 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 127.50 లక్షల మెట్రిక్‌టన్నులు ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసింది. ఇందులో 70.13 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకొని తగిన ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 8329 కొనుగోలు కేంద్రాలకు ప్రారంభించడానికి నిర్ణయం తీసుకుని ఇప్పటివరకు 7340 కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉంచి ధాన్యం కొనుగోలు వేగవంతంగా చేస్తోంది. వానాకాలంలో సన్నాలకు రూ. 500 బోనస్ఇవ్వడంతో యాసంగి సీజన్లో రైతులు పెద్ద మొత్తంలో సన్నవరి సాగు చేశారు. ప్రభుత్వం ఆశించిన దానికంటే ఎక్కువ ధాన్యం రావడంతో తమ వ్యుహాం ఫలించిందని వ్యవసాయ శాఖ హర్షం వ్యక్తం చేస్తోంది.
10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
పౌర సరఫరాల ఇప్పటివరకు 35, 600 మంది రైతుల నుంచి 10 లక్షల మెట్రిక్‌టన్నులు ధాన్యం కొనుగోలు చేసింది. అందులో 6.40 లక్షల సన్నాలు కాగా, 3.60 లక్షల మెట్రిక్‌టన్నుల దొడ్డు సన్నధాన్యం సేకరించింది. రెండు రకాల ధాన్యానికి ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేసింది. నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట, వనపర్తి, గద్వాల, కరీంనగర్, జనగాం జిల్లాలలో పెద్ద ఎత్తున సేకరిస్తోంది. కొనుగోలు కేంద్రాలలో గ్రేయిన్కాలిఫర్స్, ఎలక్ర్టానిక్స్తూకపు మిషన్లు, మాయిశ్చర్మీటర్లతో పాటు టార్బాలిన్లు, క్లినర్లు, హస్క్, రిమూవర్వంటి యంత్రాలను సరిపడ్డ అందుబాటులో ఉంచి కొనుగోలు ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకొంటుంది. కేంద్రాలు, పీఏసీఎస్, ఐకేసీ గ్రూపుల ఆధ్వర్యంలో నడస్తున్నాయి.
మిల్లర్లు తీసుకెళ్లగా మిగిలిన ధాన్యం గోదాములకు తరలింపు
ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 66.65 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు ఉన్నాయి. కేంద్రాల నుంచి మిల్లర్లకు కేటాయించిన ధాన్యం వారు సీఎంఆర్కోసం తీసుకెళ్లగా మిగతా ధాన్యం నిలువ చేసేందుకు వ్యవసాయ శాఖ మార్కెటీ కమిటీ, రాష్ట్ర గిడ్డంగుల సంస్ధలకు చెందిన గోదాములతో పాటు ప్రైవేటు వాటిల్లో నిలువ చేసేందుకు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గోదాములో 25 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ చేసేందుకు అవకాశం ఉందని అధికారులు చెప్పారు.
సరిపడ లేని గన్నీ బ్యాగులు
రబీ సీజన్‌కు 17.5 కోట్ల గన్నిబ్యాగులు అవసరం ఉండగా, 9.45 కోట్లు కొత్తవి, 8.05 కోట్లు పాతవి ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం 9.23 కోట్ల గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచగా వాటిలో కూడా ధాన్యం నింపారు. ఇటీవల గన్నీ బస్తాలకు కోసం టెండర్ల పిలువగా ప్రక్రియ పూర్తియితే వారం రోజుల్లో 2కోట్ల గన్నీ బ్యాగులు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది.
ఆదరాబాదరాగా అమ్మకాలు
వరి కోతల సమయంలో అకాల వర్షాలు కురుస్తుండటంతో రైతులు కల్లాల నుంచి ధాన్యం నేరుగా తీసుకొచ్చి కేంద్రాల వద్ద రాశులుగా పోస్తున్నారు. వాటిని నిర్వహకులు అడ్డుగోలుగా తూకం వేసి బస్తాకు 5 కిలోల వరకు తరుగు కోత పెడుతున్నారు. కొందరు రైతులు పచ్చిధాన్యం తీసుకొస్తున్నారని, మరికొందరు తాలు ఉన్న ధాన్యం తేవడంతో తప్పని సరి పరిస్థితుల్లో తరుగు తప్పదని కేంద్రాలు నిర్వహకులు చెప్పారు. లేకుంటే మిల్లర్లు తీసుకోవడం లేదని, ఒక వేళ వారు తీసుకెళ్లిన ఆన్లోడింగ్చేసే సమయంలో తరుగు తీసి ధాన్యం బస్తాలు లెక్కగడుతున్నట్లు వెల్లడించారు. అకాల వర్షాలకు రైతులు ఆరుగాలలు పండించిన మిల్లర్లకే మేలు చేస్తోందని రైతుసంఘాల నాయకులు ఆరోపించారు.