RGV Missing: అరెస్ట్ భయంతో ఆర్జీవీ అదృశ్యం?

by Rani Yarlagadda |   ( Updated:2024-11-25 06:27:36.0  )
Ram Gopal Varma Controversial Comments On NDAs Presidential Candidate Draupadi Murmu
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ (Ysrcp) హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై ఆర్జీవీ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఒంగోలులో నమోదైన ఈ కేసు విచారణకు ఆర్జీవీ హాజరు కాకపోగా.. అరెస్ట్ నుంచి రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. తాము రక్షణ కల్పించలేమని చెప్పడంతో.. విచారణకు వచ్చేందుకు కాస్త సమయం కావాలని కోరాడు.

ఇచ్చిన గడువు ముగిసినా ఆర్జీవీ (RGV) విచారణకు రాకపోవడంతో.. ఒంగోలు పోలీసులు హైదరాబాద్ లోని ఆర్జీవీ డెన్ (RGV Den) కు చేరుకున్నారు. విచారణకు సహకరించకపోతే ఆయన్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆర్జీవీ అసలు ఇంట్లోనే లేరన్న విషయం తెలిసింది. ఎక్కడికెళ్లారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీంతో అరెస్ట్ భయంతోనే ఆర్జీవీ పారిపోయాడని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Read More: Big Breaking: మరికొద్దిసేపట్లో ఆర్జీవీ అరెస్ట్ ?

Advertisement

Next Story