- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి
దిశ, గంగాధర : మహిళలు అన్ని రంగాల్లో ఆర్థిక శక్తిగా ఎదగాలని, మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండల కేంద్రంలో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించి మాట్లాడారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ఆర్థిక శక్తిగా ఎదగడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని మహిళా సంఘాల అభివృద్ధికి సహకారాన్ని అందిస్తామని, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో మరమ్మతు పనులను స్వశక్తి సంఘాలకు అప్పగించిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే స్కూల్ యూనిఫామ్ ను కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా, మహిళా సంఘాలకే అప్పగించినట్టు చెప్పారు.
గంగాధర మండలంలో నాలుగు ఎకరాల్లో సోలార్ ప్యానల్ ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని, తహసీల్దార్ మండలంలో ఎక్కడైనా నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి ప్రపోజల్ పంపిస్తే కలెక్టర్ తో మాట్లాడి సోలార్ ప్యానల్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. గ్రామాల్లో మహిళా సంఘం సభ్యులు సమావేశాలు నిర్వహించుకోవడానికి గ్రామ గ్రామాన అంచలంచెలుగా వీఓ సంఘ భవనాలను నిర్మిస్తామని, స్వశక్తి సంఘంలోని మహిళలు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి చేయూతనందించడానికి 10 లక్షల బీమా సౌకర్యం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. గంగాధర మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.