ఆధిపత్య ధోరణితో ప్రేమ తగ్గిపోతుందా..? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-11-25 06:50:44.0  )
ఆధిపత్య ధోరణితో ప్రేమ తగ్గిపోతుందా..? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
X

దిశ, ఫీచర్స్: ఒక మనిషితో మంచి బంధాన్ని ఏర్పరుచుకోవడానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పడుతుంది. కానీ, దానిని విచిన్నం చేసేందుకు ఒక్క నిమిషం కూడా పట్టదు. సెలబ్రిటీస్, క్రీడలు, వ్యాపారం, సినిమా ఇలా ఏ ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు అయినా ఉన్నత స్థాయికి ఎదిగే కొద్ది వారి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే.. వారి రిలేషన్‌షిప్‌లో అనేక మార్పులు వస్తాయి. కథలు, సినిమాలలో చాలా వరకు సాధారణ వ్యక్తి ఉన్నతస్థాయికి ఎదిగిన తరువాత పెళ్లి లేదా ప్రేమ రిలేషన్‌ సక్సెస్ అయినట్లు అందులో చూపిస్తారు. కానీ, నిజ జీవితంలో మాత్రం ఇలా అస్సలు జరగదని అధ్యయనాలు చెబుతున్నాయి.

సాధారణ వ్యక్తుల కంటే పవర్‌ఫుల్ వ్యక్తుల రిలేషన్ అంత రొమాంటిక్‌గా ఉండదని ఒక అధ్యయనం తెలిపింది. పవర్‌ఫుల్ వ్యక్తులకు ఎక్కువగా ఆధిపత్యం చెలాయించే గుణం పెరిగి, వారి జీవిత భాగస్వామిని మోసం చేసే చాన్స్ ఎక్కువగా ఉందని అమెరికాకు చెందిన రోచెస్టర్ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టులు చేసిన అధ్యయనంలో ఈ షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఇద్దరిలో ఎవరైనా ఒకరు ఉన్నతస్థాయికి చేరుకున్న తరువాత తమ జీవిత భాగస్వామిపై ప్రేమ తగ్గుతుందని ఈ అధ్యయనంలో వెల్లడించారు. ఇద్దిర మధ్య అభిప్రాయ బేధాలు, గౌరవం, ప్రేమను తగ్గిస్తుందని వెల్లడించారు.

చాలామంది వ్యక్తులు వారు ఉన్నతస్థాయికి చేరిన తరువాత భాగస్వామితో రిలేషన్‌లో ఉండరని, వారు ఎక్కువగా భాగస్వామితో కాకుండా ఇతర వ్యక్తులతో బంధం కోసం ప్రయత్నిస్తారని తెలిపారు. ఆధిపత్యం ధోరణి కారణంగా ఇద్దరిలో ఎవరైనా సరే భాగస్వామిని చూసే విధానంలో మార్పులు వస్తాయి. అంతేకాకుండా దీని వల్ల రిలేషన్‌లో నిజాయితీ తగ్గిపోతుంది. ఇలాంటి వ్యక్తులకు గర్వం ఎక్కువగా ఉంటుంది. తామే అంతా చేస్తున్నామని, తమ వల్లే తన భాగస్వామి జీవిస్తుందనే భ్రమలో ఉంటారు. ఇటువంటి ఆలోచన వారి రిలోషన్‌‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఆధిపత్యం చెలాయించే భాగస్వామి అన్నీ నిర్ణయాలు తానే తీసుకుంటారు. ఎక్కడికి వెళ్లాలి, ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, జీవితాన్ని ఎలా గడపాలి ఇటువంటివి భాగస్వామిపై ద్వేషాన్ని కలిగిస్తాయి.

Advertisement

Next Story

Most Viewed