- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS: చెక్కులు ఇవ్వకపోతే లబ్దిదారులతో ధర్నా.. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం
దిశ, వెబ్ డెస్క్: చెక్కుల పంపిణీ(Cheque Distribution) విషయంలో కళ్యాణ లక్ష్మి లబ్దిదారులను(Kalyana Lakshmi Beneficiaries) ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేది లేదని కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally BRS MLA Madhavaram Krishna Rao) అన్నారు. ఇవాళ ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన.. కూకట్ పల్లి నియోజకవర్గం(Kukatpally constituency)లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఆగిపోవడంపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. కూకట్‌పల్లి నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వచ్చి నెల రోజులు గడుస్తున్నదని, 550 మంది లబ్ధిదారులకు చెక్కులు నిలిపివేయడం దుర్మార్గమని అన్నారు. చెక్కుల కోసం లబ్దిదారులు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, తాను అధికారులను రిక్వెస్ట్ చేస్తే మంత్రి వచ్చాక ఆయన చేతుల మీదగా లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పుతున్నారని మండిపడ్డారు.
ఆనవాయితీ ప్రకారం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు ఎమ్మెల్యేలే పంపిణీ చేస్తారని, కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం మంత్రి వస్తేనే పంపిణీ చెప్పటం దారుణమన్నారు. నెల రోజులుగా కలెక్టర్(Collector), ఆర్డీఓ(RDO) , ఎంఆర్ఓ(MRO) పలుమార్లు ఫోన్ చేసినా మంత్రి వస్తేనే పంపిణీ అనే సమాధానం చెప్పడం సరైన పద్ధతి కాదని, ఎమ్మెల్యే రావడం అధికారులకు ఇబ్బంది అయితే అధికారులే పంపిణీ చేయాలని కూడా చెప్పినట్లు తెలిపారు. ఇది ఒక రకంగా నిరుపేదల పొట్ట కొట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు ఇబ్బంది పెట్టితే ఊరుకోమని, రేపు ఉదయం 11 గంటల వరకు లబ్దిదారులకు పంపిణీ చేయకపోతే ఎంఆర్ఓ ఆఫీసు(RO Office) దగ్గర ధర్నా(Dharna) చేస్తామని మాధవరం కృష్ణారావు అధికారులను హెచ్చిరించారు.