BRS VS Congress : ఫ్రెండ్లీ మ్యాచ్! మంత్రి పొన్నం బౌలింగ్, హరీశ్ రావు బ్యాటింగ్ వైరల్

by Ramesh N |   ( Updated:2024-11-25 11:58:44.0  )
BRS VS Congress : ఫ్రెండ్లీ మ్యాచ్! మంత్రి పొన్నం బౌలింగ్, హరీశ్ రావు బ్యాటింగ్ వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. పచ్చి గడ్డి వేస్తే బగ్గుమనేల పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అలాంటి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కీలక నేతలు ఓ కార్యక్రమంలో సరదాగా క్రికెట్ ఆడి అందరినీ అలరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్.. మాజీ మంత్రి హరీశ్ రావు ఇద్దరూ (Cricket) క్రికెట్‌ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్‌‌గా మారింది.

నిన్న యూసఫ్‌గూడా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన డిజిటల్ మీడియా ప్రీమియర్ లీగ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో (Minister Ponnam Prabhakar) పొన్నం ప్రభాకర్.. మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఇద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజీపై మంత్రి పొన్నం ప్రభాకర్ బౌలింగ్ చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు ప్రతి బాల్ కూడా సిక్స్ కొట్టినట్లే కొట్టారు. ఈ ఘటన వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫ్రెండ్లీ మ్యాచ్ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. హరీశ్ రావుది మామూలు బ్యాటింగ్ కాదని ఊర మాస్ బ్యాటింగ్ అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. ఇద్దరు గ్రేట్ ప్లేయర్స్ అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed