- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
RGV Advocate: సమాధానం చెప్పినా పోలీసులు ఇంటికి రావడమేంటి?
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ప్రముఖ సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఇంటికి ఒంగోలు పోలీసులు వచ్చారు. ఆర్జీవీ ఇంట్లో లేరని చెప్పండంతో పోలీసులు ఇంటి బయటే.. ఆయన కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. తాజాగా.. పోలీసులు ఇంటికి రావడంపై ఆయన అడ్వొకేట్(RGV Advocate) స్పందించారు. ‘రామ్ గోపాల్ వర్మకు పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. రెండు నోటీసులకు తాము సమాధానం ఇచ్చాము. డిజిటల్ విచారణకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే స్పష్టం చేశాం. ఈ విషయాన్ని డీఎస్పీకి వాట్సాప్ ద్వారా తెలియజేశాం. అయినా పోలీసులు ఇంటి వరకు రావడం కరెక్ట్ కాదు. ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి’ అని రామ్ గోపాల్ వర్మ అడ్వొకేట్ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. రామ్ గోపాల్ వర్మ ఈరోజు ఒంగోలు రూరల్ పీఎస్‌లో విచారణకు హాజరు కావాల్సి ఉంది.
అయితే ఈరోజు కూడా ఆయన విచారణకు డుమ్మాకొట్టారు. షూటింగ్ పనుల్లో తాను బిజీగా ఉన్నానని.. తనకు వారం రోజుల సమయం కావాలని ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌ల మార్ఫింగ్ ఫొటోలను వర్మ గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆయనపై పలు చోట్ల పోలీసు కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు రేపు విచారించనుంది.
Read More: RGV Missing: అరెస్ట్ భయంతో ఆర్జీవీ అదృశ్యం?