బావిలో నీళ్లు తాగేందుకు వెళ్లి తిరిగిరానిలోకాలకు..

by Sumithra |
బావిలో నీళ్లు తాగేందుకు వెళ్లి తిరిగిరానిలోకాలకు..
X

దిశ, మహబూబాబాద్: దాహం తీర్చుకోడానికి బావిలో నీటికొరకు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి యువతి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని కొట్యానాయక్ తండాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొట్యానాయక్ తండాకు చెందిన ధారావత్ రమ్య (25) భర్త రాజేష్‌తో కలిసి తోటలో కలుపు తీస్తున్న క్రమంలో దాహం వేయడంతో.. మంచినీళ్ల కోసం బావిలోకి దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి తల్లి భూక్య బుజ్జి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story