- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూన్-5న బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
దిశ, వెబ్‌డెస్క్ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన సిలింగేర్ మారణకాండను వ్యతిరేకిస్తూ జూన్-5వ తేదీన గడ్చిరౌలి దండకారణ్యం బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. అదేవిధంగా బస్తర్ డివిజన్ నుంచి పోలీస్ క్యాంపును ఎత్తివేయాలని మావోయిస్టు పార్టీ గడ్చిరౌలి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ డిమాండ్ చేసింది.
గతనెల మే17న బస్తర్ డివిజన్ లోని బీజాపూర్-సుక్మా జిల్లా సరిహద్దు గ్రామం సిలింగేర్‌లో CRPF పోలీస్ క్యాంపునకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఆదివాసీ ప్రజలపై సీఆర్ఫీఎఫ్ బలగాలు మారణకాండను సాగించాయని మావోయిస్టు పార్టీ గుర్తు చేసింది. పోలీసులు జరిపిన లాఠీచార్జిలో 38 గ్రామాలకు చెందిన 296 మంది నిర్దోషులు తీవ్రగాయాల పాలయ్యారని సోమవారం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే జూన్-5న తలపెట్టిన బంద్ నాడు దేశవ్యాప్తంగా నిరసనలు, ప్రతిఘటనలకు మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ పిలుపునిచ్చింది.