- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దీదీ దేశ నాయకురాలు
భోపాల్ : ఇటీవలే ముగిసిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని మట్టి కరిపించి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మమతా బెనర్జీపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. 2024 లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలలో ప్రధాని మోడీకి ప్రత్యామ్నాయంగా పలువురు ఆమె పేరును ప్రతిపాదిస్తున్నారు. ఇదే విషయమై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ స్పందించారు. మమతా బెనర్జీ దేశ నాయకురాలు అని కొనియాడారు. వరుసగా మూడు సార్లు బెంగాల్ ముఖ్యమంత్రిగా ఎన్నికైనందుకు ఆమెను ప్రశంసించారు.
కమల్‌నాథ్ స్పందిస్తూ.. ‘మమతా బెనర్జీ ఇప్పుడు దేశ నాయకురాలు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆమె ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, సీబీఐ, ఈడీ, ఇతర వ్యవస్థలతో ఒంటరిగా పోరాడి విజయం సాధించారు’ అని అన్నారు. 2024 లో మోడీకి ప్రత్యామ్నాయంగా యూపీఎ ఆమెను నిలబెట్టనుందా..? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. దాని మీద ఇప్పుడే స్పందించడం కరెక్ట్ కాదని, సమయమొచ్చినప్పుడు స్పందిస్తానని కమల్ నాథ్ తెలిపారు.