పెరిగిపోతున్న మేల్ సెక్స్ వర్కర్స్..!

by Anukaran |
పెరిగిపోతున్న మేల్ సెక్స్ వర్కర్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్ : సెక్స్ వర్కర్.. ఈ పేరు ఇప్పటి వరకు ఆడవారికే పరిమితం అయ్యేది. ఎక్కడైనా మహిళ సెక్స్ వర్కర్ పట్టుబడింది అనే చూశాం.. విన్నాం. కానీ ఈ మధ్య కాలంలో మగ వాళ్లు కూడా వ్యభిచారులుగా మారుతున్నారు. ఎంతగా అంటే.. ఫిమేల్ సెక్స్ వర్కర్లను దాటేసెటంతా. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇది నమ్మాల్సిన నిజం. పాశ్చాత దేశాలకే పరిమితమైన మేల్ సెక్స్ వర్కర్ల వృత్తి క్రమంగా దేశంలోకి ప్రవేశించింది. డబ్బు సంపాదన కోసం ఈ దారిని ఎంచుకుంటున్నట్లు యువత చెబుతుండడం గమనార్హం.

సాధారణంగా మహిళలే ఎక్కువగా సెక్స్ వర్కర్లుగా మారుతుంటారు. ఇంట్లోని ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, నమ్మిన వారు చేసే మోసాలతో ఈ వృత్తిలోకి ఎక్కువగా వెళ్తుంటారు. కానీ, మారుతున్న సామాజిక పరిస్థితులు, ఊరిస్తున్న అడ్డదారి అవకాశాలతో మగవాళ్లు కూడా మేల్ సెక్స్ వర్కర్లుగా మారుతుండడం విస్తుగొలుపుతోంది. మేల్ సెక్స్ వర్కర్ల విస్తరణపై ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కేరళ రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సర్వే ప్రకారం.. కేరళలో 17,000 మంది మహిళా సెక్స్ వర్కర్లు, 13,331 మంది మేల్ సెక్స్ వర్కర్లు ఉన్నారు. అయితే వీరంతా కేరళ రాష్ట్రానికి చెందిన వారే కాదని తెలింది. ఇక్కడికి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన సెక్స్ వర్కర్లు కూడా వేలల్లో ఉన్నట్లు సర్వేలో గుర్తించారు. దీని వల్ల కూడా రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు సర్వేలో స్పష్టం అయింది. మగ సెక్స్ వర్కర్లు మాత్రం కేరళలో కోజికోడ్ జిల్లా నుంచి ఎక్కువగా వస్తున్నారు. వీరంతా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన వారుగా తెలిసింది. నగరాలకు వలస వచ్చిన యువత.. హోటళ్లు, ఫ్లాట్లల్లో అద్దెకు ఉంటూ.. ఈ అసాంఘిక కార్యకలాపాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని వెల్లడైంది. మగ సెక్స్ వర్కర్లుగా 36 నుంచి 46 ఏళ్ల మధ్య వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో గుర్తించారు.

ప్రకృతికి నిలయమైన కేరళ.. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రం. ఇక్కడికి ఏటా లక్షలాది మంది టూరిస్టులు వస్తుంటారు. వారితో పాటే ఈ రాష్ట్రానికి ఇతర ప్రాంతాల నుంచి సెక్స్ వర్కర్లు కూడా దిగుమతి అవుతున్నారు. ముఖ్యంగా బెంగాల్, బీహార్, ఒడిశా నుంచి మహిళా సెక్స్ వర్కర్లు ఎక్కువగా వలస వస్తున్నట్లు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ గుర్తించింది. బెంగాల్ ఏజెంట్ల ద్వారా ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు కేరళకు వస్తున్నారని సర్వే ద్వారా బహిర్గతమైంది. ఇక పురుషుల్లో బీహార్ నుంచి వస్తున్న వారే ఈ వృత్తిలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని తేటతెల్లం అయింది. ఈ వృత్తిలోకి వస్తున్న వారంతా క్రమంగా వారి బంధుమిత్రులను కూడా ఇదే వృత్తిలోకి తీసుకొస్తుండడం ఆందోళన కలిగించే అంశం.

ఒక్క కేరళ రాష్ట్రమే కాదు.. హైదరాబాద్ లోనూ మేల్ సెక్స్ వర్కర్లు విపరీతంగా పెరిగిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్లను ఏర్పాటు చేసి ఈ చీకటి దందాను నడిపిస్తున్నట్లు గుర్తించారు. గతంలో అమీర్ పేట కేంద్రంగా నడుస్తున్న ఓ మేల్ సెక్స్ వర్కర్ల నెట్ వర్క్ ను పోలీసులు ఛేదించారు. యువతకు ఆకర్షించేలా ‘సుఖంతోపాటు వేలల్లో వేతనాలంటూ’ప్రకటనలిస్తూ.. మేల్ సెక్స్ వర్కర్లుగా మారుస్తున్నారు. ఆ తర్వాత ఎంట్రీ, డిపాజిట్ ఫీజుల పేరుతో లక్షల రూపాయలు దండుకున్న సంఘటనలు పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటుచేసుకున్నాయి. మరికొంత మందిని మేల్ సెక్స్ వర్కర్లుగా మార్చి.. కమీషన్లు దండుకుంటున్నారు. ఏది ఏమైనా రాష్ట్రాల్లో మగ వ్యభిచారులు పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశమే..!

Advertisement

Next Story