- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హైదరాబాద్‌లో మహీంద్రా యూనివర్సిటీ
దిశ, వెబ్ డెస్క్ :
వ్యాపారంలోనే కాకుండా సామాజిక మాద్యమాల్లో కూడా చురుగ్గా ఉంటూ.. సొసైటీలో జరిగే కొత్త విషయాలను అందరికీ తెలిసేలా చేయడం ఒక్క ఆనంద్ మహీంద్రాకే చెల్లుతుంది. అలాంటిది దేశంలోని యువతకు మంచి భవిష్యత్తు అందించాలనే ఆశయంతో చైర్మన్ మహీంద్రా నేతృత్వంలోని మహీంద్రా గ్రూప్ తమ విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభించింది. మంత్రి కేటీఆర్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వర్చువల్‌గా యూనివర్సిటీని ప్రారంభించారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బహదూర్‌పల్లిలో 130 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్ (పీహెచ్‌డీ) కోర్సులు అందించనున్నట్లు తెలిపారు. మహీంద్రా ఎకోలే సెంట్రేల్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ కూడా ఈ యూనివర్సిటీలో భాగం కానుంది.
యూనివర్సిటీ ఏర్పాటుకు ఇదే సరైన సమయమని ఆనంద్ మహీంద్రా అన్నారు. మెరుగైన ప్రపంచం కోసం భావితరాలకు విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థుల కోసం 1950ల్లోనే కేసీ మహీంద్రా స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ప్రతి 8 మంది భారతీయుల్లో ఒకరు మాత్రమే కాలేజీ విద్యను అభ్యసిస్తున్నారని, మిగతావారికి ఆ అవకాశం దొరకడం లేదని ఆనంద్ మహీంద్రా తెలిపారు.