- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బడ్జెట్‌ను చూస్తే భయమేస్తోంది..
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర బడ్జెట్‌ను చూస్తే భయమేస్తుందని, ప్రభుత్వం తెస్తున్న అప్పులు చూస్తుంటే ఆందోళన కలుగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. శనివారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారీబడ్జెట్ లో ప్రాధాన్యత రంగానికి అనుకున్నంత కేటాయింపులు లేవని, విద్యా, వైద్యరంగానికి మొండిచేయి చూపించారన్నారు.
కరోనా కారణంగా ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిన విషయమేనని, అయినప్పటికీ వైద్యరంగానికి దేశ అవరేజ్ కంటే తక్కువగా కేటాయింపులు ఉన్నాయని భట్టి వివరించారు. రోడ్లు, బ్రిడ్జీలకు దేశ ఆవరేజ్తో పోల్చితే చాలా తక్కువగా కేటాయించారని ఆరోపించారు. ఉద్యోగాల విషయంలో కూడా అన్యాయం జరుగుతుందని, ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తుచేశారు.
కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలు అమ్ముతామని స్పష్టంగా చెబుతోందని, మన రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలు ఉన్నాయని, వాటిని మూసివేస్తే వేల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడుతారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలని, కేంద్రాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు రాష్ట్రంలో అప్పులభారం విపరీతంగా పెరుగుతోందని, ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు చూస్తే ఆందోళన కలుగుతోందని భట్టి ఆందోళన వ్యక్తంచేశారు.