నారా లోకేశ్‌పై కేసు నమోదు.. ఏడాది తర్వాత నోటీసులు

by srinivas |
నారా లోకేశ్‌పై కేసు నమోదు.. ఏడాది తర్వాత నోటీసులు
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేశ్‌పై సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో గత ఏడాది జూన్ 12న కేసు నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి వివరణ ఇవ్వాలని లోకేశ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ సందర్భంగా పరామర్శకోసం జూన్ 12న సూర్యారావుపేట కోర్టు సెంటర్‍కు నారా లోకేశ్ వెళ్లారు.

ఆ సమయంలో నారా లోకేశ్ కరోనా నిబంధనలు పట్టించుకోలేదని ఆయనపై పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం కరోనా వ్యాప్తికి కారణమయ్యారంటూ నారా లోకేశ్, కొల్లు రవీంద్ర, పట్టాభి, దేవినేని చందులపై పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేశ్‌పై కేసు నమోదు చేయడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. లోకేశ్ పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed