స్పేస్ స్టేషన్

by Ravi |   ( Updated:2024-11-10 23:30:34.0  )
స్పేస్ స్టేషన్
X

నా గుండె ఆకుపచ్చని

మొక్క తల్లడిల్లుతుంది.

నీ చూపుల వర్షపు

తడి నాపై కురవనందుకు..!

నా హృదయపు అంతరిక్షం

దిగాలుగా ఒంటరిదయ్యింది.

నీ మాటల తారల ప్రకాశం

నన్ను తాకనందుకు..!

నా కలల జలపాతం కన్నీటి

సంద్రమై కరిగిపోయింది.

నీ ఆలోచనల ప్రవాహంలో

నన్ను ఆహ్వానించనందుకు..!

నా జీవితపు ఎడారి నిరాశ

గాలిలో చెదిరిపోయింది.

నీ నవ్వుల ఇంద్రధనుస్సు నా ఆశల

మేఘంపై ముద్రించనందుకు..!

నా ఈ అక్షర తుఫాన్ కవిత్వమై

నీ హృదయ వాట్సాప్‌ను కదిలిస్తే

నీ జీవిత స్పేస్ స్టేషన్‌లో నీవాడినవుతాను..!

ఫిజిక్స్ అరుణ్ కుమార్

93947 49536

Advertisement

Next Story

Most Viewed