- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తాగుబోతు భర్త
X
పల్లవి.
నేనెట్ల జేతునే సంసారమూ..!?
నేనెల్లిపోతనే మా ఇంటికి...
తాగుబోతోడికి నన్నంటగట్టిరి...
చీటికిమాటికి నన్ను తాగొచ్చి కొడుతడు
ఎంత జెప్పినా గాని ఇనిపించుకోడాయే
ఇంటి సంసారం పట్టించుకోడాయే
పెండ్లి జేసుకున్న సుఖము లేకాపాయే
తాగి తాగి వీడు అస్థిపంజరమాయే..
ఎంత జెప్పినా గాని తాగుడు మానకపాయే
ఎద్దోలే తింటడు ఎగిరెగిరి తంతడు..
కట్టుకున్నోడు కొట్టి సంపూతుంటే
మెట్టినింటి వాళ్ళు పట్టించుకోకుంటే
ఎవరితో చెప్పాలి నా బాధలు
ఏమని చెప్పనూ నా యెతలూ
పని చేతగానోడు పండిపొర్లాడుతడు
వొండి పెట్టిందంతా ఊడుసుకొని తింటడు
కనికరం లేనోడు నామొగడు....
ఎట్ల జస్తడోగాని ఈ మొగడు...
యేగలేను నేను ఏనాటికీ
ఎల్లిపోతావున్న మా ఇంటికి
నేను ఎల్లిపోతావున్న మా ఇంటికి
-గడ్డమీది చంద్రమోహన్ గౌడ్
98665 10399
Advertisement
- Tags
- Poem
Next Story