భవిష్యత్తును ఎన్నుకో

by Ravi |   ( Updated:2023-11-27 00:45:54.0  )
భవిష్యత్తును ఎన్నుకో
X

గడిచిన కాలాన్ని నెమరువేసుకుంటు..

భవిష్యత్తుకు బంగారు దారిని వెతుకు.

మాయమాటల చాటున దాగిన మర్మాన్ని చూడు.

కులం.. మతం.. ప్రాంతం.. ప్రాతిపదికన...

ఓటుకు రేటు పెడుతున్న రాజకీయాన్ని గమనించు.

నోట్లకట్టలు చూసు నోరెళ్ళబెట్టకు.

సారా కంపుకు సంతోషపడకు.

పదో పరకకో ఆశపడి..

పిల్లల భవిష్యత్తును బుగ్గిపాలు చెయ్యకు.

వచ్చినఅవకాశం చేజారి పోయాక...

ధర్నాలు రాస్తారోకోలుచేసి దగాపడిపోకు.

నువ్వు నడుస్తున్న రోడ్డును చూడు.

నువ్వు ట్రీట్మెంట్ పొందుతున్న దవాఖానాను చూడు.

మీ పిల్లలు చదువుతున్న బడులను చూడు.

తలాపున పారుతున్న గోదారమ్మ కన్నీరును చూడు.

గిట్టుబాటుదక్కని రైతన్న గోసను చూడు.

నకిలీ విత్తనాలతో నలిగిపోతున్న సేద్యకాడిని చూడు.

ఉపాదిలేక ఉసూరుమంటున్న యువతను చూడు.

పైవన్నిటిని చూసి నువ్వోటెసె గుర్తును చూడు.

నీకు నచ్చినవాడికి...రేపు నిను మెచ్చె వాడికి

పట్టం కట్టు.

గరీబోన్ని బతకనిచ్చే నాయకుడికి దండంపెట్టు.

ఊరువాడను అద్దంలా తయారుచేసి..

అభివృద్ధిని చేసే నాయకున్ని ఆదరించు.

కష్టసుఖాల్లో కలిసినడిచే రాజకీయనాయకున్ని

ఆదరించు.

భవిష్యత్తును భద్రంగా ఎన్నుకో.

బాధ్యతగా ఓటును వినియోగించుకో.

ఆశల పల్లకిలో ఊరేగించి...

అందినకాడికి అందిపుచ్చుకుని..

ఇచ్చిన హామీలను మరిచిపోయే నాయకున్ని..

ఊరవుతలకు తరిమికొట్టు.

అశోక్ గోనె

9441317361

Advertisement

Next Story