కొందరు ఎడమ చేతితో ఎందుకు రాస్తారు?

by Aamani |
కొందరు ఎడమ చేతితో ఎందుకు రాస్తారు?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగు శాతం మందికి ఎడమచేతి వాటం కలవాలని తెలుస్తుంది. ఎడమ చేతివాటం ఉన్న వారిలో ప్రఖ్యాతిగాంచిన శిల్పులు లియోనార్డో డావిన్సీ, మైఖేలాంజిలో లాంటివారు ఉన్నారు. మెదడు మొత్తం ఒకే భాగంగా ఉండి తన విధులను నిర్వర్తించదు. కుడి అర్థగోళం, ఎడమ అర్థగోళంగా విడివిడిగా కార్యనిర్వహణ చేస్తాయి. ఈ రెండింటి పనితీరులో కూడా తేడా ఉంటుంది. సాధారణంగా ఎడమ మస్తిష్క అర్థగోళం కంటే కుడి అర్థగోళం చురుకుగా ఉంటుంది. ఇక ఎడమ శరీర భాగాలు కుడి అర్థగోళం ఆధీనంలో కుడి శరీర భాగాలు ఎడమ అర్థగోళం ఆధీనంలో ఉంటాయి. గోళం చురుకుదనం వల్ల కుడి శరీర భాగాలు చదవడం, రాయడం, మాట్లాడడం ఇతర పనులు చేయడంలో ముందుంటాయి. అయితే కొద్ది మందిలో కుడి అర్థగోళం ఎక్కువ చురుగ్గా ఉండి ఎడమ అర్థగోలంపై ఆధిక్యత సాధిస్తుంది. అలాంటివారిని ఎడమచేతి వాటంగా పిలుస్తారు.

Advertisement

Next Story

Most Viewed