- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘రామ్ ఆయేంగే’.. మోడీ మెచ్చిన ‘మెస్మరైజింగ్’.. ఎవరు పాడారంటే..
దిశ, ఫీచర్స్ : ‘రామ్ ఆయేంగే’.. ప్రస్తుతం ఈ భక్తిగీతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రతి ఒక్కరూ షేర్ చేస్తున్నారు. పైగా త్వరలో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవాల నేపథ్యంలో ఇది అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ దీనిని ‘మెస్మరైజింగ్ భజన్’ అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ భజన గీతంతోపాటు దానిని ఆలపించిన స్వాతిమిశ్రా అనే యువతి పాపులర్ అయింది. దీంతో ఈ స్వాతి మిశ్రా ఎవరు?, ప్రధాని మోడీని ఎలా ఆకట్టుకుంది? అని తెలుసుకునేందుకు చాలామంది గూగుల్ సెర్చ్ చేస్తున్నారు.
వాస్తవానికి స్వాతి మిశ్రా గతేడాది అక్టోబర్‌లో ‘రామ్ ఆయేంగే’ అనే లిరిక్‌ను రిలీజ్ చేసింది. మరోసారి జనవరి 2న ‘రామ్ ఆయే హై’ అనే కొత్త ట్రాక్‌ని కూడా విడుదల చేసింది. ప్రజెంట్ అందరి మనసులో చెరగని ముద్రవేసిన వ్యక్తిగా స్వాతి మిశ్రా ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఈ స్వాతి మిశ్రా ఎవరంటే.. ఆమె ముంబైకి చెందిన ఒక సంగీత విద్వాంసురాలు, కంటెంట్ క్రియేటర్, ఫ్రీలాన్సర్, భక్తి గీతాలు, భజన పాటలు ఆలపించడం, వీడియోలు రిలీజ్ చేయడం చేస్తూ ఉంటుంది. కాగా జనవరి 3 ఉదయం ప్రధాని మోడీ ఆమె పాడిన రామ్ ‘ఆయేంగే’ లిరిక్‌ని ఎక్స్‌లో పోస్ట్ చేయగానే సంచలనంగా మారింది. ఇక జనవరి 22న అయోధ్యలో జరగబోయే రామమందిర ప్రారంభోత్సవాల నేపథ్యంలో రాముడికి అంకితం ఇచ్చేలా ‘రాముడు వనవాసం నుంచి తిరిగి వచ్చాడు’ అనే మరో లిరిక్‌తో ఆకట్టుకునేందుకు రెడీగా ఉంది స్వాతి మిశ్రా. అయితే ప్రధాని తన పాటను పోస్ట్ చేయడం, మెస్మరైజింగ్ అని ప్రస్తావించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నది.