రిలేషన్ షిప్‌లో మగవారు ఏం కోరుకుంటారంటే?

by Jakkula Samataha |
రిలేషన్ షిప్‌లో మగవారు ఏం కోరుకుంటారంటే?
X

aదిశ, ఫీచర్స్ : ఏ రిలేషన్ షిప్ అయినా సరే బలంగా ఉండాలంటే ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం.కొంతమంది ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా గొడవ పెట్టుకుంటారు. అందువలన బంధం దృఢంగా బలంగా ఉండాలంటే నమ్మకం అనేది చాలా అవసరం. కాగా. ప్రతి రిలేషన్ షిప్‌లో మగవారు అమ్మాయిల నుంచి కోరుకునేది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దీని ద్వారా మహిళలు తమ బంధం‌లో గొడవలు రాకుండా చూసుకోవచ్చు.

తన భాగస్వామి అబద్ధం చెప్పడం మగవారికి అస్సలే నచ్చదంట. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే తనతో తన భార్య లేదా ప్రియురాలు నిజమే చెప్పాలని కోరుకుంటాడంట. ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది బ్రేకప్ చెప్పుకోవడానికి అబద్ధం కూడా ఒక కారణం అవుతుందనడంలో అతిశయోక్తి లేదు.

తాను పక్కనే ఉన్నంత సేపు తన భార్య తనకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంట. ఫొన్‌లో మునిగిపోవడమో లేక తన పుట్టింటి వారితో గంటలు తరబడి మాట్లాడటం అస్సలే నచ్చదంట. ఇలా చేస్తే అబ్బాయిలకు నా భాగస్వామి నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని బాధపడుతాడంట. చివరకు ఇదే విడిపోవడానికి కూడా కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు.

శృంగార సంబంధాలలో భౌతిక సంబంధానికి ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది, భావోద్వేగ, శారీరక అవసరాలను పరిష్కరించడం. పురుషులు కేవలం లైంగిక సంతృప్తికి మించిన సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. ఆప్యాయత, కౌగిలింతలు, సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటారు. పరిపూర్ణమైన శారీరక సంబంధం సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తుంది, భావోద్వేగ బంధాలను బలపరుస్తుంది. ప్రేమ, ఆప్యాయత యొక్క ముఖ్యమైన వ్యక్తీకరణగా పనిచేస్తుంది.అందువలన వారితో వారికి నచ్చినప్పుడు క్లోజ్‌గా మూవ్ అవ్వాలంట. అది మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడేలా చేస్తుందంటున్నారు మానసిక నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed