అతి అంచనాలతో అలసిపోతున్నారా?.. అది ‘ఫ్యూచర్ ఫేకింగ్’ కావచ్చు !

by Javid Pasha |
అతి అంచనాలతో అలసిపోతున్నారా?.. అది ‘ఫ్యూచర్ ఫేకింగ్’ కావచ్చు !
X

దిశ, ఫీచర్స్ : ‘ఫ్యూచర్ ఫేకింగ్’ గురించి మీరెప్పుడైనా విన్నారా? ఇటీవల సోషల్ మీడియా వేదికల్లో పలువురు డిస్కషన్ చేసుకున్న పాపులర్ వర్డ్ ఇది. కొందరు వ్యక్తులు తమ భవిష్యత్తు గురించి తాము, అలాగే ఇతరులు చేయబోయే పనుల గురించి కూడా తామే వాస్తవానికి భిన్నంగా అతి అంచనాలకు వస్తుంటారు. ఇటువంటి విపరీత ధోరణినే మానసిక నిపుణులు సైకాలజికల్ పరిభాషలో ‘ఫ్యూచర్ ఫేకింగ్’ ప్రవర్తనగా పేర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో ఉన్న వ్యక్తులు తరచూ వ్యక్తిగత, సామాజిక అంశాల్లో ఓవర్ కాన్ఫిడెంట్ ప్రదర్శిస్తుంటారు. ఇతరులతో కన్వర్జేషన్ సందర్భంగానూ ఒకటికి రెండు మాటలు కలిపి గొప్పలు చెప్తుంటారు. అత్యుత్సాహంతో సాధ్యం కాని వాగ్దానాలు చేయడం, తప్పక చేస్తామని పలు విషయాల్లో ప్రామిస్ చేయడం చేస్తుంటారు. తీరా వచ్చేసరికి వారు చెప్పిందంతా ఫేక్ అని తేలిపోతుంది.

భవిష్యత్తులపై అంచనాలు

సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఆశలు, ఆకాంక్షలు, భవిష్యత్తుపై అంచనాలు ఉంటాయి. కానీ తమకున్న శక్తి సామర్థ్యాలు, వనరులు, నెట్వర్క్‌ను బట్టి వాటికో లిమిటేషన్ ఉంటుంది. కానీ ‘ఫ్యూచర్ ఫేకింగ్’ బిహేవియర్ మాత్రం అందుకు భిన్నం. ఒక విధంగా ఇది వాగ్దానాలు, హామీల విషయంలో మానిపులేషన్ చేయడం వంటిదని నిపుణులు చెప్తున్నారు. ఈ విధమైన ప్రవర్తన ఎందుకు వస్తుందో ప్రత్యేకించి చెప్పలేం. పుట్టి పెరిగిన వాతావరణం, సామాజిక సంబంధాల కారణంగా రూపుదిద్దుకునే వ్యక్తిత్వంగానూ కొందరిలో ఏర్పడే చాన్స్ ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఎలాగంటే.. తరచూ గొప్పలు చెప్పుకునే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ఉండే మరో వ్యక్తి కూడా క్రమంగా దానిని అలవర్చుకొని మరింత ఎఫెక్టివ్‌గా ‘ఫ్యూచర్ ఫేకింగ్’ చేయవచ్చు.

ఏదో చేస్తాం అనుకుంటారు కానీ..

భవిష్యత్తులో తాను ఏదో చేస్తానని, మరేదో సాధిస్తానని వాస్తవాలకు భిన్నమైన అంచనాలతో ఇతరుల ముందు చెప్పుకోవడం ఫ్యూచర్ ఫేకింగ్‌లో ఉండే అతి ధోరణి. ఉదాహరణకు ఒక వ్యక్తి తన దగ్గర కనీసం బైకు కొనేందుకు కూడా డబ్బులేదనుకోండి. కానీ అతను ఇతరులతో మాట్లాడేటప్పుడు మాత్రం ‘మరో నెలరోజుల్లో నేను కారు కొనబోతున్నాను. ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను’ అంటాడు. తీరా సమయం వచ్చేసరికి కొనడు. పైగా ఇబ్బందిగా ఫీలవుతుంటాడు. ఇక తాను గొప్పలు చెప్పుకున్న వ్యక్తి కనిపిస్తే గిల్టీగా ఫీలవడం, మొహం చాటేయడం చేస్తుంటాడు. ఇలా చాలామంది ‘ఫ్యూచర్ ఫేకింగ్’ వాగ్దానాలతో విసిగిపోతుంటారని, అలసిపోతుంటారని నిపుణులు చెప్తున్నారు. ఇక మరికొందరు ఇతరులను ఆకర్షించడానికి కూడా మాటలతో ‘ఫ్యూచర్ ఫేకింగ్’ క్రియేట్ చేస్తుంటారు. తాము ఇతరులకు సహాయం చేస్తుంటామని, పేదలకు దాన ధర్మాలు చేస్తుంటామని గొప్పలు చెప్తుంటారు. కానీ వాస్తవంలో అందుకు భిన్నంగా వారి ఆచరణ ఉంటుంది. ఇలా ఒక్క విషయంలోనే కాదు, కుటుంబం, పిల్లలు, ఉద్యోగం వంటి చాలా విషయాల్లోనూ ‘ఫేక్ సంభాషణలు’ కొనసాగించే వ్యక్తులను తర్వాత మానసికంగా అలసటకు గురవుతారని, వినేవారికి వాస్తవం తెలిశాక చులకనై పోతారని నిపుణులు చెప్తున్నారు.

ఎలా బయటపడాలి?

‘ఏదో ఒక రోజు’ లేదా ‘సమయం వచ్చినప్పుడు’ అనే వాగ్దానాలతో కూడాఫ్యూచర్ ఫేకింగ్ క్రియేట్ చేస్తుంటారు. అంటే వ్యక్తులు తాము చేయబోయే పనుల విషయంలో కచ్చితమైన తేదీలు లేదా చర్యలకు ఎప్పుడూ కట్టుబడి ఉండరు. ఫైనల్లీ వాస్తవ చర్యలు లేకుండా కాలం గడిచిపోతుంది. అయితే ఇటువంటి బిహేవియర్ నుంచి బయటపడాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. సదరు ఫేకింగ్ క్రియేటర్లను సహజరులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు తరచూ ప్రశ్నించడం, వాస్తవాలను చెప్పాలని సున్నితంగా కోరడం వంటివి మార్పునకు దోహదం చేస్తాయి. అలాగే బాధిత వ్యక్తులు కూడా తాము క్రియేట్ చేసే ఫేక్ సమాచారంవల్ల భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో ఆలోచిస్తూ కొంతకాలం అటువంటి వాగ్దానాలకు, అతి అంచనాలకు దూరంగా ఉండటం ప్రాక్టీస్ చేయాలి. అవసరమైతే బౌండరీస్ సెట్ చేసుకోవాలి. ఒకవేళ మార్పు రాకపోతే మానసిక నిపుణులను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.

Advertisement

Next Story