- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్వీట్లు ధూమపానంకంటే డేంజరా?.. తినకుండా ఎలా ఉండగలం?
దిశ, ఫీచర్స్ : ఆహారంలో భాగంగా కొందరు స్వీట్లను ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే వాటి స్థాయిని, రూపాన్ని బట్టి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ధూమపానం కంటే కూడా అధిక చక్కెర తీసుకోవడం హానికరమైందని తేలింది. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని పెంచడంలో షుగర్ కీ రోల్ పోషిస్తుంది. స్టడీలో భాగంగా యూఎస్‌కు చెందిన నలుగురు సైంటిస్టులు ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వారు కొంతకాలం ఎలుకలను రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపునకు సాధారణ వాటర్ ఇవ్వకుండా షుగర్ ఎక్కువగా కలిపిన వాటర్ ఇచ్చారు. మరొక గ్రూపులోని ఎలుకలకు నార్మల్ వాటర్ ఇచ్చారు. ఈ సందర్భంలో ఎలుకల బ్రెయిన్ యాక్టివిటీస్, అలాగే వాటిలో శారీరకంగా వస్తున్న మార్పులను అబ్జర్వ్ చేశారు.
అయితే నార్మల్ వాటర్ తాగిన ఎలుకలకంటే కూడా షుగర్ ఎక్కువగా ఉన్న వాటర్ తాగిన ఎలుకల్లో భిన్నమైన ప్రవర్తనను పరిశోధకులు గమనించారు. పైగా ఒకసారి చక్కెర స్థాయిలు అధికంగా ఉన్న వాటర్‌ను తాగిన ఎలుకల్లో కాసేపటికే అధిక దాహం, అధిక ఒత్తిడిని గమనించారు. అవి వింతగా ప్రవర్తించడాన్ని అబ్జర్వ్ చేశారు. వాటి బ్రెయిన్ యాక్టివిటీస్‌ను ఆధునిక టెక్నాలజీ, మెడికల్ థీమ్స్ యూజ్ చేసి ఎనలైజ్ చేశారు. మొత్తానికి అధిక చక్కెరలు మెంటల్ స్ట్రెస్‌ను పెంచుతాయని కనుగొన్నారు. ఈ పరిస్థితి మనుషుల్లో ఎదురైతే కొంతకాలానికి బీపీ, షుగర్ వంటివి పెరిగి గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్స్ వంటి సమస్యలు తలెత్తే చాన్స్ ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. అందుకే షుగర్‌ను వివిధ ఆహారాలు, పానీయాల రూపంలో మోతాదుకు మించి వాడకూడదని సూచిస్తున్నారు. పైగా అది ధూమపానంకంటే కూడా ఎక్కువగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు.