- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాలికల్లో ముందే యుక్తవయసు.. పునరుత్పత్తి హార్మోన్లపై నీలి కాంతి ప్రభావం
దిశ, ఫీచర్స్ : ప్రపంచ జనాభాపై కొవిడ్ కలిగించిన ఆరోగ్య సమస్యల జాబితాలో మరింత కలవరపరిచే అంశం.. 'ఎర్లీ ప్యూబర్టీ' పొందుతున్న అమ్మాయిల సంఖ్య పెరగడం. నిర్దేశిత దశ కంటే ముందే యుక్త వయసుకు చేరుతున్న ఈ పరిస్థితినే 'ఇడియోపతిక్ ప్రీకోషియస్ ప్యూబర్టీ'గా పిలుస్తారు. అయితే పాండమిక్ ప్రారంభ నెలల్లోనే ఈ సంఖ్యలో పెరుగుదల గుర్తించినట్లు పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. అంతేకాదు వైరస్‌కు, ఎర్లీ అడాలసెన్స్‌కు మధ్య సంభావ్య సంబంధాన్ని ఈ అధ్యనాలు హైలైట్ చేశాయి. లాక్‌డౌన్ టైమ్‌లో గంటల తరబడి స్మార్ట్ డివైసెస్‌లో స్క్రోలింగ్ చేయడం కూడా దీనికి కారణమై ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
టర్కీలోని ఘాజీ యూనివర్సిటీ, అంకారా సిటీ హాస్పిటల్ పరిశోధకులు 18 అపరిపక్వ ఆడ ఎలుకలను ప్రతిరోజూ తక్కువ లేదా ఎక్కువ కాలం పాటు ఎల్‌ఈడీ స్క్రీన్స్ నుంచి వెలువడే కాంతి వర్ణపటానికి బహిర్గతం చేశారు. ఇక్కడ ఎక్కువ కాలం బ్లూ లైట్ కింద గడిపిన ఎలుకలు మిగిలిన వాటి కంటే త్వరగా మెచ్యూరిటీ పొందిన లక్షణాలను కనుగొన్నారు. కాగా 'మెలటోనిన్ స్థాయిలను మార్చడానికి సరిపోయే బ్లూ లైట్ ఎక్స్‌పోజర్.. పునరుత్పత్తి హార్మోన్ స్థాయిలను కూడా మార్చగలదని, ఇదే క్రమంలో ఎర్లీ ప్యూబర్టీకి కారణమవుతుందని ఎలుకల నమూనా పరిశోధన ద్వారా కనుగొన్నాము' అని ఘాజీ యూనివర్సిటీకి చెందిన అధ్యయన ప్రధాన రచయిత, ఎండోక్రినాలజిస్ట్ ఐలిన్ కిలిన్ ఉగుర్లు తెలిపారు.
పాండమిక్ టైమ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది బాలికలు ఎందుకు యుక్తవయస్సుకు చేరుకున్నారనే విషయంలో వ్యక్తిగతీకరించిన డిజిటల్ టెక్నాలజీ ప్రభావం ఉండటం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. గణాంకపరంగా చెప్పాలంటే.. చాలామంది 12 ఏళ్ల వయసులో యుక్తవయస్సు ఆనందాలను(మరియు భయానకాలను) అనుభవించడం ప్రారంభిస్తారు. సాధారణంగా అబ్బాయిల్లో 9 నుంచి 14 వరకు, బాలికల్లో 8 నుంచి 13 వరకు ఎప్పుడైనా ఈ స్థితి కలగవచ్చు. బాలికలకు ప్రీకోసియస్ యుక్తవయస్సు అనేది ఎనిమిదేళ్ల కంటే ముందే ఉద్భవించే ద్వితీయ లైంగిక లక్షణాలకు సంకేతాలుగా నిర్వచించబడింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది అమ్మాయిలు ఉన్నారనేది నమ్మకంగా చెప్పడం కష్టం. హార్మోన్ల ప్రారంభ పెరుగుదలకు కారణాలు కూడా రహస్యంగా ఉన్నాయి. కాబట్టి ఇడియోపతిక్ నిష్పత్తికి స్పష్టమైన కారణం లేదు.
ఈ క్రమంలోనే టర్కీలో ముందస్తు యుక్తవయస్సు ఇడియోపతిక్ రూపాన్ని నివేదించే అమ్మాయిల సంఖ్య ఏప్రిల్ 2019లో 25 నుంచి మార్చి 2020 నాటికి 58కి పెరిగినప్పుడు పరిశోధకులు ఆశ్చర్యపోయారు. అధిక కేలరీల ఆహారాల నుంచి మహమ్మారి భయం వరకు కారణాలు ఏవైనా ఉండవచ్చని ప్రతిపాదించారు. అలానే స్మార్ట్ పరికరాల వినియోగం పెరగడమూ ఒక కారణం కావచ్చని.. ప్రతిరోజూ మనం ఫోన్లు, టాబ్లెట్స్ నుంచి వెలువడే నీలి కాంతికి బహిర్గతమయ్యే సమయం గణనీయంగా పెరిగిందని అభిప్రాయపడ్డారు. ప్రధానంగా మానవ శరీరాల నిర్మాణం పగటిపూట మేల్కొని సూర్యకాంతిని పొందడంతో పాటు సంధ్యా సమయం తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు అనువుగా డిజైన్ చేయబడింది. ఈ కార్యాచరణకు తీవ్రమైన అంతరాయం ఏర్పడితే అది మన ఆరోగ్యాన్ని లోతైన మార్గాల్లో గందరగోళానికి గురి చేస్తుంది. చాలా మటుకు మెలటోనిన్ అనే హార్మోన్ ఆటుపోట్లకు అంతరాయం కలిగించవచ్చు. సాధారణంగా రాత్రిపూట నిద్రకు ఉపకరించే రసాయనంగా పరిగణిస్తున్నా.. మానవ అభివృద్ధిలో కీలకమైన సమయాన మెలటోనిన్ నిరోధం అనేది శరీరాన్ని యుక్తవయస్సు కోసం సిద్ధంచేసే హార్మోన్లను పెంచడానికి ప్రేరేపిస్తుందని తెలుస్తోంది.
ఎలుకలను మరింత అనుకూలమైన పరీక్షా అంశంగా ఉపయోగించి, పరిశోధకుల బృందం ఈ పరికల్పన నిజమయ్యే అవకాశం ఉందని నిరూపించింది. ప్రతిరోజూ బ్లూ లైట్ పరిధిలో రెట్టింపు సమయం గడిపిన ఆడ ఎలుకలు.. మిగతావాటి కంటే చాలా తక్కువ వయస్సులో యుక్తవయసును చేరుకుంటాయి. అంటే అవి తక్కువ మెలటోనిన్ స్థాయిలు కలిగి ఉండటంతో పాటు పునరుత్పత్తి రసాయన సంకేతాలైన ఓస్ట్రాడియోల్, లుటినైజింగ్ హార్మోన్ యొక్క అధిక స్థాయిలను కలిగి ఉంటాయి. అయితే ఇతర అంశాలు కూడా ముఖ్యమైన పాత్రను పోషించలేవని ఇది సూచించదు. ఎందుకంటే యుక్తవయసుకు సంబంధించిన జీవశాస్త్రం చాలా క్లిష్టంగా ఉంటుంది. 'ఇది ఎలుక అధ్యయనం కాబట్టి ఈ ఫలితాలు పిల్లల్లో ప్రతిరూపం అవుతాయని ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఈ డేటా బ్లూ లైట్ ఎక్స్‌పోజర్.. మునుపటి కంటే త్వరగా యుక్తవయసుకు చేరుకునేందుకు ప్రమాద కారకంగా పరిగణించబడుతుందని ఈ అధ్యయనం సూచిస్తుంది' అని పరిశోధకులు తెలిపారు.
'బ్రా'లెస్ గౌనులో పిచ్చెక్కించిన సెక్సీ బ్యూటీ.. 'పాజిటివ్ వైబ్స్ ఓన్లీ' అంటూ..
దసరా ఈవెంట్‌లో రోజాకు షాక్.. అవమానించడానికే పిలిచారా అంటూ ఎమోషనల్