The kiss effect : అలా ముద్దు పెట్టుకున్నప్పుడు నిజానికి ఏం జరుగుతుందో తెలుసా?

by Javid Pasha |
The kiss effect : అలా ముద్దు పెట్టుకున్నప్పుడు నిజానికి ఏం జరుగుతుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : పేరెంట్స్ పిల్లలకు ముద్దు పెట్టడం, జంటలు పరస్పరం కిస్ చేసుకోవడం వంటివి సాధారణంగా హ్యాపీనెస్‌తో ముడిపడిన అంశాలుగానే మనకు తెలుసు. కానీ ముద్దు పెట్టుకోవడం వివిధ రోగాలకు కారణం అవుతుందని మీకు తెలుసా? నెదర్లాండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ అప్లైడ్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. అయితే చెంపలమీద, నుదుటి మీద పెట్టే ముద్దు వల్ల మాత్రం ఎలాంటి నష్టం లేదని, ఒక వ్యక్తి పెదవుల నుంచి మరో వ్యక్తి పెదవులపై పెట్టే (ఫ్రెంచ్ కిస్) ముద్దు వల్ల మాత్రమే ఈ రిస్క్ పొంచి ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు.

సాధారణంగా ఫ్రెంచ్ కిస్ వల్ల ఒక వ్యక్తి శరీరం నుంచి మరో వ్యక్తి శరీరంలోకి వందలకొద్దీ బ్యాక్టీరియాలు ప్రవేశిస్తాయని నిపుణులు చెప్తున్నారు. అయితే ముద్దు పెట్టుకునే ఇద్దరు వ్యక్తులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు దీనివల్ల రిస్క్ ఉండదు. కాకపోతే ఒక వ్యక్తిలో ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు లేదా వ్యాధికారక బ్యాక్టీరియా లేదా వైరస్ డెవలప్ అయి ఉన్నప్పుడు మాత్రమే అవతలి వ్యక్తికి వ్యాప్తిచెందే చాన్స్ ఉంటుందని రీసెర్చర్స్ అంటున్నారు. అధ్యయనంలో భాగంగా ‘నెదర్లాండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ అప్లైడ్ సైంటిఫిక్ రీసెర్చర్స్’కు చెందిన పరిశోధకులు 21 జంటల నుంచి లాలాజలం, నాలుకపై ఉన్న మెటల్ నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా పరిశధకులు ఒక వ్యక్తి నోటిలో సుమారు 700 రకాలకంటే ఎక్కువ బ్యాక్టీరియాలు ఉంటున్నట్లు గుర్తించారు.

కాగా కపుల్స్ ముద్దు పెట్టుకోక ముందు వారి నోటిలోని లాలాజలంలో గల బ్యాక్టీరియాలను, అలాగే పెదవులపై గాఢమైన ముద్దు పెట్టుకున్న తర్వాత వారి లాలాజంలోని బ్యాక్టీరియాలను పరిశోధకులు విశ్లేషించారు. అయితే కిస్ చేసుకున్న తర్వాత జంటల్లో ఒకే రకమైన బ్యాక్టీరియాలు అత్యధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. అంటే ఇక్కడ బ్యాక్టీరియా ముద్దు కారణంగా ఒకరి నుంచి మరొకరికి బదిలీ అయ్యిందని వారు పేర్కొన్నారు. కాబట్టి ఫ్రెంచ్ కిస్ వల్ల బ్యాక్టీరియాల వ్యాప్తి పొంచి ఉంటుందని చెప్తున్నారు. అందుకే జంటలు ముద్దు పెట్టుకోవడానికి ముందు నోటి శుభ్రంగా ఉంచుకోవడం, ఆహార పదార్థాలు తిన్న తర్వాత నోటిని కడుక్కోవడం, అలాగే ఉదయం, రాత్రి పడుకోవడానికి ముందు బ్రష్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే హానికారక బ్యాక్టీరియాలు పెరిగే అవకాశం తగ్గుతుందని సూచిస్తు్న్నారు.

సాధారణ ముద్దు అయినా, ఫ్రెంచ్ కిస్ అయినా హ్యాపీనెస్, మెంటల్ హెల్త్‌తోనూ ముడి పడి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఎదుటి వ్యక్తిపై ప్రేమవల్ల పెట్టుకుంటారు కాబట్టి ఈ సందర్భంలో ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్ వంటి హ్యాపీనెస్ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. దీంతో స్ట్రెస్ రిలేటెడ్ కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయి. ముద్దు పెట్టుకోవడం అధిక రక్తపోటు సమస్య తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఆ సమయంలో రక్త నాళాలు విస్తరిస్తాయి కాబట్టి రక్త ప్రసరణ మెరుగుపడటంవల్ల గుండె జబ్బుల రిస్క్ కూడా తగ్గిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం.

Advertisement

Next Story

Most Viewed