- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రెగ్నెన్నీ టైమ్‌లో అలా కూర్చోవచ్చా?
దిశ, ఫీచర్స్ : పెళ్లి తర్వాత గర్భధారణ అనేది ప్రతీ మహిళ జీవితంలో ఒక మధురమైన అనుభూతి. తనకు ఎదరయ్యే చిన్న చిన్న సమస్యల కంటే.. తల్లి కాబోతున్నాననే ఆలోచననే మహిళ ఆనందంలో మునిగిపోయేలా చేస్తుంది. అయితే తొలిసారి గర్భధారణ సమయంలో నడక, ప్రవర్తన, ఆరోగ్యం విషయంలో పలు మార్పులు సంభవిస్తాయి. నెలలు నిండేకొద్ది కూర్చోవడం, నిల్చోవడం కూడా కష్టంగా మారుతుంది. ఈ సమయంలో కాళ్లు అడ్డంగా చాచి (క్రాస్ లెగ్) కూర్చోవచ్చా? లేక పొడవుగానే చాచి కూర్చోవాలా? కుర్చీపైనే కూర్చోవచ్చా లేదా? అనే అనుమానాలు కలుగుతుంటాయి. ఎలా కూర్చుంటే కడుపులోని బిడ్డకు ఏం జరుగుతుందోననే భయం వెంటాడుతుంది. ఇలాంటి అనుమానాలకు ప్రసూతి వైద్య నిపుణులు చక్కటి సమాధానం ఇస్తున్నారు.
ప్రెగ్నెన్సీ పీరియడ్ ప్రారంభం నుంచి 9 నెలలు వచ్చే వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కాళ్లు అడ్డంగా లేదా, మరోలా చాచి కూర్చోవడం అలవాటుగా ఉంటే తప్పకుండా అలాగే చేయవచ్చు. గర్భిణీలైన మహిళలు ఒక్కొక్కరు ఒక్కో జీవన శైలిని కలిగి ఉంటారు. కొందరికి పూర్తిగా రెస్ట్ తీసుకునే అలవాటు ఉంటే.. మరి కొందరికి తమ పనులు తాము చేసుకునే అలవాటు ఉంటుంది. కాగా తమకున్న పరిస్థితిని బట్టి 'క్రాస్ లెగ్స్' వేసి కూర్చోవడానికి అలవాటు పడినవారు.. అదే ఫాలో అయినా ఇబ్బందేం ఉండదు. కానీ కంఫర్ట్ లేకపోతే మాత్రం ఇలా చేయకూడదు. అంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో చేసే పనులేవీ గర్భాశయంపై ఒత్తిడి పెంచేవిగా ఉండకూడదు.
క్రాస్ లెగ్స్ సిట్టింగ్‌తో ప్రయోజనాలు
*గర్భిణీలు కాళ్లు అడ్డంగా చాచి కూర్చోవడంవల్ల తుంటికాళ్ల ఎముకలకు మంచిది.
*అంతర్గత అవయావాలకు, శరీరానికి రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగు పడుతుంది. అయితే ఇలా కూర్చునే అలవాటు లేనివారు, నెలలు నిండాక అలా కూర్చోవడానికి ట్రై చేయకూడదు.
*'కటివలయ' నొప్పి వంటివి ఉన్నవారు క్రాస్ లెగ్స్ పొజిషన్‌లో కూర్చోకూడదు.
*కూర్చునే సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్టు అనిపించినా, శరీర బరువు కాళ్లపై పడినట్టు తోచి అన్‌కంఫర్టబుల్‌గా ఫీలైనా అలా కూర్చోవడం తగదు.
*అలాగే అధిక బ్లీడింగ్, గర్భాశయ సమస్యలు ఉన్నవారు కూర్చోకూడదు.
*కాళ్లమీద కూర్చోవడంవల్ల ఒత్తిడి, అసౌకర్యం, చీలమండలం, జాయింట్స్‌పై ఒత్తిడి కలుగుతున్నట్లయితే.. రక్తప్రసరణ మందగించే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి కాళ్లవాపుకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి కూర్చునే విధానంలో కంఫర్ట్ చూసుకోవాలి. అనుమానాలుంటే నిపుణులను సంప్రదించాలి.
READ MORE
Unknown Facts : మనం శరీరంలో కొన్ని అవయవాలు లేకపోయినా బ్రతకవచ్చని తెలుసా ?