చింత చిగురులో అద్భుత పోషకాలు.. థైరాయిడ్ సమస్యను కూడా తగ్గిస్తుందట..

by Javid Pasha |
చింత చిగురులో అద్భుత పోషకాలు.. థైరాయిడ్ సమస్యను కూడా తగ్గిస్తుందట..
X

దిశ, ఫీచర్స్ : చింత చిగురు.. తీపి, పులుపు, ఒగురు మిళతమై ఉండే అద్భుతమైన పోషకాలు కలిగిన ఆకు కూరగా దీనిని పేర్కొనవచ్చు. అయితే ఇది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండదు. సీజనల్ వైజ్‌గా లభిస్తుంది. సంవత్సరానికి రెండు లేదా మూడు సార్లు చింత చెట్లు పూత దశకు వస్తుంటాయి. ఈ దశకు ముందు పాత ఆకులు రాలిపోతూ.. కొత్త ఆకులు చిగురిస్తుంటాయి. వీటినే చింత చిగురుగా పేర్కొంటారు. పప్పులో, వంకాయల్లో, నాన్ వెజ్‌లో కలిపి వండుకుని తింటుంటారు. అయితే ఇందులో అనేక పోషకాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యను దూరం చేయడంలో చింత చిగురు అద్భుతంగా ఉపయోగపడుతుందట.

చింత చిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంవల్ల చింత చిగురును తినేవారిలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. ఒళ్లు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా ఆస్కార్బిక్ యాసిడ్, విటమిన్ సి, టార్టారిక్ యాసిడ్స్ ఉండటం మూలంగా చింత చిగురును ఆహారంలో భాగంగా యూజ్ చేయడంవల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతోపాటు చింత చిగురును నీటిలో ఉడికించి, ఆ తర్వాత ఆ కషాయంతో పుక్కిలిస్తే పంటి, గొంతు నొప్పులు తగ్గుతాయి.

Advertisement

Next Story