Heart attack:మీ గుండె జాగ్రత్త.. హార్ట్ ఎటాక్ ఎలా వస్తుందంటే..?

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-20 05:34:31.0  )
Heart attack:మీ గుండె జాగ్రత్త.. హార్ట్ ఎటాక్ ఎలా వస్తుందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో ప్రముఖులు వ్యాయామం చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలి చనిపోవడం కలవర పెండుతోంది. జిమ్‌లో కసరత్తు చేస్తూ కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో కన్నుమూశారు. ఇదే కోవలో హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ ట్రెడ్ మిల్‌పై పరిగెడుతూ గుండెపోటుతో కుప్పకూలారు. ఇటీవల కోల్ కతాలో లైవ్ పర్ ఫార్మెన్స్ ఇస్తూ ప్రముఖ సింగర్ క్రిష్ణకుమార్ కున్నాత్ గుండెపోటుతో మృతి చెందారు.


పెళ్లి బారత్‌లో గుర్రంపై కూర్చున్న వ్యక్తి డ్యాన్స్ చేస్తూ ఒక్క సారిగా కుప్పకూలిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎలాంటి అనారోగ్య కారణాలు లేకుండానే యువత ఇటీవల గుండెపోటు బారిన పడి చనిపోయిన వార్తలు తరచూ చూస్తునే ఉన్నాం. గతంలో పదో తరగతి విద్యార్థి సైతం గుండెపోటుతో మరణించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మధ్య ప్రదేశ్ లో ఈనెల 4న గుడిలో పూజ చేస్తున్న వ్యక్తి ఒక్క సారిగా కుప్పకూలగా ఆసుపత్రికి తరలించే లోగా మరణించాడు. ఈ నేపథ్యంలో గుండె పోటు ఎలా సింప్టమ్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం.

ఎలా స్టార్ట్ అవుతుందంటే..

గుండె పోటు వచ్చేటప్పుడు మొదటగా అరగంట లేదా అంతకంటే ముందు నుంచి ఛాతిలో నొప్పి స్టార్ట్ అవుతుందని వైద్యులు తెలిపారు. సాధారణంగా ఎడమ చేతిలోనూ నొప్పి వస్తుందని, ఆ వెంటనే విపరీతంగా చెమటలు పడతాయి. వెంటనే మనం గుర్తించకపోతే గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు అంటున్నారు. హాస్పిటల్ బయట గుండెపోటు వచ్చే వారిలో కేవలం 3 నుంచి 8 శాతం మంది మాత్రమే ప్రాణాలతో బయట పడుతున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు.

గుండెపోటు సింప్టమ్స్ ఇవే..

* కడుపులో తీవ్రమైన నొప్పి

* పొత్తి కడుపు ఉబ్బినట్లుగా అనిపించడం

* కడపులో గ్యాస్ పెరిగినట్లు, లేదా అసిడిటీగా అనిపించడం

* ఛాతిపై ఒత్తిడి పేరుకున్నట్లు అనిపించడం

* గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం

* శరీరం మొరాయిస్తున్నట్లు అనిపించడం

* గుండె నుంచి వెన్నువైపుగా నొప్పి కదులుతున్నట్లు అనిపించడం, దీన్ని నడుం నొప్పిగా భావించి నెగ్లెట్ చేయొద్దు.

* కుటుంబంలో 30 లేదా 40 వయసు గల వారు ఎవరైనా ఒక్క సారిగా గుండె పోటుతో మరణిస్తే కుటుంబ సభ్యులు వెంటనే హృద్రోగ పరీక్షలు చేయించుకోవాలి.

బీ కేర్ ఫుల్..

జిమ్ కు వెళ్లే అలవాటు లేని వారు ఒక్క సారిగా పెద్ద బరువులు ఎత్తకూడదని వైద్యులు సూచిస్తున్నారు. క్రమంగా బరువు పెంచుకుంటూ వెళ్లాలని తెలిపారు. విపరీతంగా చెమటలు పడితే బాడీ డీ హైడ్రెట్ అయినట్లు భావించి వెంటనే నీరు ఎక్కువగా తీసుకోవాలి. శరీరంలో సోడియం స్థాయి పడిపోకుండా జాగ్రత్త పడాలి. మద్యం, ధూమపానం, డ్రగ్స్ తీసుకుని వ్యాయమం చేయడం హానికరమని గుర్తుంచుకోవాలి. జిమ్ కు వెళ్లేటప్పుడు తీసుకునే ఎనర్జీ డ్రింక్స్, ప్రోటీన్ పౌడర్, ఇతర సప్లిమెంట్ విషయంలో జాగ్రత్త వహించాలి.


ఆయా ఉత్పత్తుల్లో స్టెరాయిడ్స్ కలిపే అవకాశముందని వాటితో ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పౌష్టికాహారాన్ని ఖచ్చితంగా తీసుకుంటే సమస్య తలెత్తదని వైద్యులు అంటున్నారు. సాధారణంగా తీసుకునే ఆహారంలో పొరపాట్ల కారణంగా జీర్ణవ్యవస్థ బలహీన పడటం ప్రారంభమవుతుంది. అలాంటి సందర్భంలో అజీర్తి, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు నిరంతరం కొనసాగితే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. గ్యాస్ సమస్య నుంచి బయటపడేందుకు రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలంటున్నారు.


ఛాతి నొప్పి గుండెపోటుకు అతిపెద్ద సంకేతంగా భావించాలి. చాలా మంది ఛాతినొప్పిని గ్యాస్ ట్రబుల్ గా భావించి నిర్లక్ష్యం చేస్తారు. ఛాతినొప్పితో పాటు విపరీతమైన భయం, చెమటలు పట్టడం కూడా గుండెపోటుకు ముందస్తు సంకేతాలని గుర్తుంచుకోవాలి. మీరు శరీరంలో వెన్నునొప్పితో బాధపడుతూ ఉంటే ఈ సమస్య నిరంతరం కొనసాగితే అది కూడా గుండెపోటుకు సంకేతం అని గుర్తుంచుకోవాలి. వెన్నునొప్పి తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. ఇలా ఆహార నియమాలు, సరైన వ్యాయామం వంటివి చేసుకుని గుండెపోటు బారిన పడకుండా ఉండవచ్చు.

Advertisement

Next Story