- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral : సముద్ర తీరంలో వింత ఆకారం.. ఏమిటోనని నిపుణులు పరిశీలించగా..!
దిశ, ఫీచర్స్ : సముద్రమంటే ఎగిసిపడుతున్న అలల కెరటాలే కాదు. అనేక రకాల జల చరాలకు ఆవాసం. అందమైన పగడపు దిబ్బలు, ఖనిజాలకు నిలయం కూడాను. ఇప్పటికీ గుర్తించని అంశాలు, జల చరాలు సముద్ర గర్భంలో దాగి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు అంటుంటారు. ఇక అప్పుడప్పుడూ సముద్ర తీరాలకు కొట్టుకు వచ్చే పదార్థాలను, ఆకారాలను నిపుణులు పరిశీలించే మిస్టరీని ఛేదిస్తుంటారు. కాగా గత సెప్టెంబర్‌లో కెనడా దేశంలోని ఓ సముద్ర తీరానికి పిండి ముద్దలా కనిపించే ఓ వింత ఆకారం గల పదార్థం కొట్టుకు వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అదేమిటి? ఎక్కడి నుంచి వచ్చిందనే మిస్టరీని శాస్త్రవేత్తలు ఇంకా ఛేదించలేకపోయారు.
కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ సముద్ర తీరాల్లో ఇటీవల కనిపిస్తున్న వింత పదార్థం వాస్తవానికి నూనె వాసనలను కలిగి ఉందని స్థానికులు కొందరు పేర్కొంటున్నారు. చమురు ఉత్పత్తులకు సంబంధించినది కావచ్చునని మరి కొందరు భావిస్తున్నారు. అయితే కెనడాకు చెందిన సముద్ర పర్యావరణ, వాతావరణ విభాగం అధికారులు మాత్రం పిండి ముద్దలా ఉన్న వింత ఆకారం చమురు ఉత్పత్తులకు సంబంధించింది కాదని తేల్చారు. కాగా అందులో జీవ సంబంధిత కణాజాలం కానీ, సముద్ర స్పంజికల గుర్తులు కానీ లేవని కూడా అంటున్నారు. దీంతో అదేమిటనేది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది.