- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాగాక పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తే.. ఇలా కంట్రోల్ చేయండి
దిశ, ఫీచర్స్: ఆల్కహాల్ తీసుకున్నాక ఆందోళన పెరుగుతుందా? అసౌకర్యానికి గురవుతున్నారా? అయితే మీరు HANGXIETYతో బాధపడుతున్నట్లే అంటున్నారు నిపుణులు.ఇది సాధారణంగా మందు తాగాక మరుసటి రోజు ఉదయం హ్యాంగోవర్ అయినప్పుడు ఎదురయ్యే పరిస్థితి. కాగా ఆల్కహాల్ మెదడులో అధిక స్థాయిలో డోపమైన్ ఉత్పత్తి చేయడం వల్ల ఇలా జరుగుతుంది. డోపమైన్ స్థాయిలు మళ్లీ తగ్గినప్పుడు..ఆందోళన తగ్గిపోయి ఆనందంగా మారుతుంది.
1. ఆందోళన, భయం పెరిగిపోతుంది.
2. తలనొప్పి, కండరాల ఒత్తిడి, కడుపులో అసౌకర్యం లేదా చెమటలు పట్టడం జరుగుతుంది.
3. ఆలోచనలతో పిచ్చెక్కి పోతుంది. ప్రజెంట్ సిచ్యుయేషన్స్‌పై దృష్టి కేంద్రీకరించడం కష్టమవుతుంది.
4. మత్తులో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల గురించిన అపరాధ భావాలకు హాంగ్జయిటీ దారితీయవచ్చు.
5. ఆందోళనతో విశ్రాంతి తీసుకోవడాన్ని సవాలుగా మారుస్తుంది.
ట్రీట్‌మెంట్
1. మీరు డీహైడ్రేట్ అయినట్లయితే శరీరం కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ప్రక్రియను వేగవంతం చేయడానికి చాలా నీరు తాగాలి.
2. హ్యాంగోవర్ ఆందోళన అవకాశాలను తగ్గించడానికి మితంగా ఆల్కహాల్ తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది.
3. ఆల్కహాల్ స్లీప్ సైకిల్‌కు అంతరాయం కలిగిస్తుంది. ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి తగినంత నిద్ర పోయేందుకు ప్రయత్నించండి.
4. మైండ్‌ఫుల్‌నెస్, బ్రీతింగ్ టెక్నిక్స్ ఈ పరిస్థితిని శాంతపరచడంలో సహాయపడతాయి.
5. కెఫీన్ ఆందోళన స్థాయిలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికే ఆత్రుతగా ఉన్నప్పుడు దానిని తీసుకోకపోవడం ఉత్తమం. ఒక కప్పు తేనె ఈ లక్షణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.