Anand Mahindra: రూ.1500 లోపే మ‌హీంద్రా కారు.. ఓ వ్య‌క్తి ప్ర‌శ్న‌కు ఆనంద్ మ‌హీంద్రా రిప్లై!

by Sumithra |   ( Updated:2022-09-03 12:38:56.0  )
Anand Mahindra: రూ.1500 లోపే మ‌హీంద్రా కారు.. ఓ వ్య‌క్తి ప్ర‌శ్న‌కు ఆనంద్ మ‌హీంద్రా రిప్లై!
X

Anand Mahindra respond sarcastically to netizen asking him to manufacture cars for 10k

దిశ‌, వెబ్‌డెస్క్ః స‌మ‌యానికి త‌గ్గ‌ట్లు వ్య‌వ‌హ‌రించే వారే అస‌లైన తెలివిమంతులు! అంత‌టి సెన్స్ ఆఫ్ హ్యూమ‌ర్ ఉండ‌బ‌ట్టే మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్, భారతదేశపు అతిపెద్ద వ్యాపార వ్యాపారవేత్తలలో ఒకరైన ఆనంద్ మహీంద్రా(Anand Mahindra)కు సోష‌ల్ మీడియాలో అంత ఫాలోయింగ్ వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటూ అటు సామాజిక స్పృహ క‌లిగించే అంశాల‌తో పాటు, చ‌మ‌త్కారంతో వ్యాపార వ్య‌వ‌హారాల‌ను జోడించి, మెప్పించే ఆనంద్ మ‌హీంద్రా ట్విట్ట‌ర్‌ పోస్ట్ ఒక‌టి వైర‌ల్ అయ్యింది. సాధార‌ణంగా త‌న‌ ఫాలోయర్‌లతో ఎప్ప‌టిక‌ప్పుడు ఎంగేజ్ అవుతూ, వారి ప్రశ్నలకు స్పందించే ఆయ‌న‌ ఈసారి కూడా, ఒక వ్య‌క్తి ప్రశ్నకు చ‌మ‌త్కారంగా సమాధానమిచ్చాడు.

రాజ్ శ్రీవాస్తవ అనే ట్విట్టర్ యూజర్ మహీంద్రాను రూ. 10,000 లోపు కార్లను తయారు చేయగలరా అని అడ‌గ్గా, మ‌హీంద్రా వ్యంగ్యంతో స్పందించాడు. "అంత‌కంటే మంచిది చేశాము. 1.5K లోపు ధ‌ర‌లో ఒకదాన్ని తయారు చేసాము" అంటూ ప‌గ‌ల‌బ‌డి నవ్వుతున్న ఎమోజితో ట్వీట్ పెట్టాడు. అందులో ఆన్‌లైన్‌లో రూ. 1399కి అమ్ముతున్న మహీంద్రా జీపు థార్ బొమ్మ మోడల్ ఆన్‌లైన్ స్క్రీన్ షాట్‌ను జత చేశాడు. మహీంద్రా పెట్టిన ఈ సమాధానం నెటిజ‌న్ల‌ను రంజింపజేసింది. చాలా మంది అతని సెన్స్ ఆఫ్ హ్యూమ‌ర్‌ని ప్ర‌శంసించారు. ఇక‌, ఈ ట్వీట్లతో ఈ బొమ్మ కార్ల అమ్మకాలు ఆకాశాన్ని తాకాయి. అంతకు ముందు స్టాక్‌లో ఉన్న ఈ థార్ టాయ్ కార్ మోడల్, కొన్ని గంట‌ల్లోనే స్టాక్ అయిపోయింద‌ని ఓ వినియోగ‌దారుడు ట్వీట్ చేశాడు.

Advertisement

Next Story

Most Viewed