హార్ట్ ఫెయిల్యూర్‌ను పసిగట్టే బెల్ట్.. Blue Tooth ద్వారా డాక్టర్లచేతికి రోగి డేటా

by sudharani |   ( Updated:2022-12-13 09:44:49.0  )
హార్ట్ ఫెయిల్యూర్‌ను పసిగట్టే బెల్ట్.. Blue Tooth ద్వారా డాక్టర్లచేతికి రోగి డేటా
X

దిశ, ఫీచర్స్: ఎవరైనా హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదంలో ఉన్నట్లయితే.. వారిపై నిరంతర పర్యవేక్షణ అవసరం. పేషెంట్ రియల్ టైమ్ సంకేతాలను గుర్తించడం ముఖ్యం. లేదంటే రోగి ప్రాణానికే ప్రమాదం. ఈ క్రమంలోనే ఫ్లోరిడా అట్లాంటిక్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఇవన్నీ మానిటర్ చేసేందుకు ఛాతీ, పొత్తికడుపునకు జోడించిన ఎలక్ట్రోడ్‌లను కలిపేలా నడుముకు ధరించే పరికరాన్ని కనుగొన్నారు.

ఇది ఎలక్ట్రో కార్డియోగ్రామ్, హార్ట్ రేట్ మానిటర్, మోషన్ డిటెక్టర్, థొరాసిక్ ఇంపెడెన్స్ సెన్సార్‌కు సంబంధించిన విధులను కలిగి ఉంటుంది. థొరాసిక్ ఇంపెడెన్స్ అనేది ఛాతీ అంతటా అయాన్ల ద్వారా తీసుకువెళ్ళే విద్యుత్ ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. గుండె వైఫల్యాన్ని గుర్తించడంలో కీలకమైన బయో-సిగ్నల్ కూడా. సెన్సార్ల నుంచి డేటా వైర్‌లెస్‌గా బ్లూటూత్ ద్వారా జత చేయబడిన స్మార్ట్‌ఫోన్‌కు ప్రసారం చేయబడుతుంది. తద్వారా హెల్త్ కేర్ వర్కర్స్‌కు సరైన సమయంలో అందుతుంది.

సాంప్రదాయిక పర్యవేక్షణ పద్ధతులతో పాటు ల్యాబ్ టెస్టుల్లోనూ.. నిర్దేశించిన అన్ని పరిమితులను కచ్చితంగా కొలవడానికి ఈ పరికరం కనుగొన్నారు. ముఖ్యంగా కూర్చోవడం, నిల్చోవడం, పడుకోవడం, నడవడం వంటి కార్యకలాపాలవల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావమూ లేదు. రోగులను పర్యవేక్షించడానికి ఇతర పద్ధతులు ఉన్నప్పటికీ.. ఈ ఆల్టర్నేటివ్స్ ఒకేసారి అనేక కొలమానాలను ట్రాక్ చేయలేవని, శస్త్రచికిత్స ద్వారా అమర్చాల్సిన సెన్సార్‌లను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. సేకరించిన డేటా ఆధారంగా గుండె వైఫల్యాన్ని అంచనా వేసే అల్గారిథమ్‌ను అభివృద్ధి చేయడానికి, ప్రోటోటైప్ బెల్ట్ ప్రస్తుతం వివిధ రకాల వాలంటీర్‌లపై పరీక్షిస్తున్నారు.

'మేము మా బెల్ట్ మాడ్యూల్‌లో విలీనం చేసిన అన్ని సెన్సార్‌లనూ రోగి రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేయకుండా చర్యలు తీసుకున్నాం. చాలా కాలం పాటు సులభంగా ధరించవచ్చు. ముఖ్యంగా గుండె వైఫల్య లక్షణాల నిరంతర, నిజ-సమయ పర్యవేక్షణ.. క్షీణిస్తున్న రోగి ఆరోగ్యం గురించి, వారి ఆరోగ్య సంరక్షకులను హెచ్చరిస్తుంది. ప్రతిగా, రోగి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు పేషెంట్‌ను మెడిసిన్స్‌తో క్యూర్ చేయొచ్చు' - శాస్త్రవేత్తలు

Read More...

బ్లాక్ క్యారెట్ తినండి.. ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టండి !

Advertisement

Next Story

Most Viewed