పొగమంచుతో శ్వాసకోశ సమస్యలా?.. ఈ జాగ్రత్తలు తీసుకోండి !

by Javid Pasha |
పొగమంచుతో శ్వాసకోశ సమస్యలా?.. ఈ జాగ్రత్తలు తీసుకోండి !
X

దిశ, ఫీచర్స్ : చలికాలం కావడంతో పొద్దున్న పొగమంచు కురుస్తూ పరిసరాలను కప్పేస్తోంది. వ్యాయామాలు, వివిధ పనులకోసం బయటకు వెళ్లేవారు కొందరు దీనివల్ల ఇబ్బంది పడుతుంటారు. పైగా ఈ విధమైన వాతావరణంవల్ల కొందరిలో లంగ్స్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుంది. ఇప్పటికే వివిధ శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా వంటి అనారోగ్యాలతో బాధపడుతుంటే గనుక ఈ సమస్య మరింత పెరిగే చాన్స్ ఉంటుంది. కాబట్టి పొగమంచు మీ ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

  • బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ ప్రాక్టీస్ చేయండి : చలికాలంలో లంగ్స్ హెల్త్ బాగుండాలంటే శ్వాస వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం. ప్రాణాయామం, డీప్ బ్రీతింగ్స్ వంటివి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. శ్వాసలో ఇబ్బందులను, అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. డయాఫ్రాగ్మాటిక్ శ్వాసకు ఇది మంచిది.
  • హైడ్రేషన్ : శరీరాన్ని హైడ్రేషన్‌గా ఉంచుకోవడం అనేది వాస్తవానికి ఎల్లప్పుడూ ఒక గోల్డెన్ రూల్. ఇది శ్వాసకోశ వాల్‌పై సన్నని శ్లేష్మ పొరను మెయింటెన్ చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ పొర గాలిలోని కణాలను ట్రాప్ చేయడంలో సహాయపడుతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. శరీరం హైడ్రేట్ అయినప్పుడు ఈ ప్రొటెక్టివ్ శ్లేష్మ పొరను ఉత్పత్తి చేయడానికి మీరు హైడ్రేడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. అందుకోసం చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే వేడి పానీయాలు తీసుకుంటూ ఉండటం మంచిది.
  • ధూమపానం మానేయండి: స్మోకింగ్, టొబాకో వినియోగం నేరుగా లంగ్స్‌పై ఎఫెక్ట్ చూపుతుంది. ఇది శ్వాసకోశ వ్యాధులను అభివృద్ధి చేసే అవకాశాలను పెంచుతుంది. ముఖ్యంగా లంగ్స్ డిసీజెస్ ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం ముఖ్యం.
  • క్వాలిటీ స్లీప్ : దాదాపు ఏడెనిమిది గంటల పాటు మంచి క్వాలిటీ స్లీప్‌ను పొందడం చాలా ముఖ్యం. దీనివల్ల మరుసటి రోజు నిద్రలేవడాన్ని యాక్టివేట్ చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను నిర్మించడంలో సహాయపడుతుంది. దీనివల్ల మీ ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా బాగుటుంది.
  • టర్మరిక్ జింజర్ టీ: పసుపులో ఔషధ గుణాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఇక అల్లం కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది. బాడీని డిటాక్సిఫ్లయింగ్ చేయడంలో సహాయపడుతుంది. పసుపు, అల్లం కలిపినప్పుడు రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, అలాగే యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటయి. కాబట్టి లంగ్స్ హెల్త్‌కు మంచి పానీయంగా నిపుణులు పేర్కొంటున్నారు.
  • హెల్తీ డైట్ : బ్లూబెర్రీస్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, నట్స్ అండ్ సీడ్స్ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అలాగే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్స్, హెల్తీ ఫ్యాట్స్‌తో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది. సిట్రస్ పండ్లు, ఆకు కూరలు విటమిన్ సి కలిగి ఉంటాయి కాబట్టి ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. నొప్పి, మంట వంటి ఇబ్బందులను నివారిస్తాయి. చలికాలంలో వీటిని తీసుకోవడం ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచిది. పొగమంచు కారణంగా వచ్చే అలర్జీలను నివారించవచ్చు.
Advertisement

Next Story